Causes of Heart Disease: ప్రపంచ గణాంకాల ప్రకారం, గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే ప్రమాదాలు ఎక్కువగానే ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 17 మిలియన్ల జనాభా గుండె సంబంధిత వ్యాధులచే భాదపడుతున్నారు. ముఖ్యంగా, గుండెపోటుకు గురవుతున్నారు. ఇది అంటువ్యాధి వలే అందరికి కలుగుతుంది కావున తగిన జాగ్రత్తలను తీసుకోవటం తప్పని సరి. ఇక్కడ గుండె సంబంధిత వ్యాధులు కలిగచేసే అలవాట్లు మరియు కారకాల గురించి తెలుపబడింది, వీటి గురించి తెలుసుకోవటం వలన గుండె వ్యాధులకు గురి చేసే అలవాట్లకు దూరంగా ఉండవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుటుంబ చరిత్ర
కుటుంబంలో ఎవరికైనా గుండె వ్యాధులు ఉంటే, అది మీకు కూడా కలిగే అవకాశం ఉంది. అధిక రక్త పీడనం, గుండె వ్యాధులు ఇతర రక్తనాళ పరిస్థితులు జన్యుపరంగా సంక్రమించే అవకాశం ఉంది. కుటుంబ చరిత్ర కలిగి ఉండి, ఒకేవిధమైన వాతావరణ పరిస్థితులలో జీవించటం వలన గుండె వ్యాధులు కలిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 65 సంవత్సరాలు దాటినా వారిలో గుండె సంబంధిత వ్యాధులు కలగటం చాలా సాధారణం అని చెప్పవచ్చు.


Also Read: Whats App Cash Back: వాట్సాప్ పేమెంట్స్‌లో రూ. 255 ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్‌.. త్వరపడండి!


సిగరెట్ తాగటం వలన 
సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారు అథెరోస్క్లెరోసిస్ వంటి గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. ఈ అలవాటు వలన గుండెలోని కరోనరీ ధమనిలో కొవ్వు పదార్థాలు పెరుకుపోతాయి. పొగ తాగటం వలన ఈ రకమైన వ్యాధికి గురై చాలా మంది మరణానికి గురి అవుతున్నారు. అంతేకాకుండా, సిగరెట్ తాగటం వలన రక్త పీడనం పెరగటం, రక్త గడ్డకట్టే ప్రమాదం అధికమవటం మరియు వ్యాయామాలను కూడా ఎక్కువగా అనుసరించలేము.


కావున, పొగతాగని వారితో పోలిస్తే, పొగతాగే వారిలో దాదాపు 4 వంతులు గుండె వ్యాధులకు గురయ్యే అవకాశాలను స్వతహాగా అభివృద్ధి చేసుకుంటున్నారు. అంతేకాకుండా, ఈ అలవాటు వలన కరోనరీ ఆర్టేరీ డిసిజేస్ మరియు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి.  


అధిక రక్తపీడనం
దీనినే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు, ఇది గుండె పని తీరును పెంచి, కవాటాలలో సున్నితత్వాన్ని పెంచి, శరీరానికి కావాల్సిన రక్తాన్ని సరఫరా చేసేలా గుండె పై ఒత్తిడిని పెంచుతుంది. ఇలా గుండె పై పీడనం పెరగటం వలన, గుండె కండరాలు బిగుతుగా మరియు మందంగా మారతాయి. ఫలితంగా కరోనరీ ఆర్టేరీ డిసిజేస్ కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.


ఈ రకమైన వ్యాధి అధికం అవటానికి గల ముఖ్య కారణం అధికరక్త పీడనం. ధమనుల  గోడలు ప్రమాదానికి గురి అవటం వలన, ఇవి సన్నగా మారి, కొవ్వు పదార్థాలు పేరుకుపోతాయి. ఈ విధంగా హార్ట్ స్ట్రోక్ కలిగే అవకాశాలు పెరుగుతాయి.


Also Read: Niloufer Hospital Hyderabad: హైదరాద్ లో దారుణం.. 100 రూపాయల కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్ బాయ్


మధుమేహం
గుండె సంబంధిత వ్యాధులను పెంచే మరొక వ్యాధి- మధుమేహం. గుండెపోటుకు గురై మరణించే వారి సంఖ్యలో, 3 వంతులు మధుమేహ వ్యాధి గ్రస్తులు అవటం విశేషం. సాధారణ వ్యక్తులతో పోలిస్తే, మధుమేహా వ్యాధి గ్రస్తులు, గుండెపోటుకు గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహ వ్యాధి కలిగిన వారిలో యుక్తవయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. టైప్-2 రకం మధుమేహం కలిగి, నడి వయసులో ఉన్నవారు అధికంగా గుండెపోటుకు గురవుతున్నారు.


అధిక కొవ్వు పదార్థాల స్థాయిలు
మైనపు కొవ్వు పదార్థాలు, గుండె యొక్క ధమని గోడల మధ్య కొవ్వు పదార్థాలు పేరుకుపోయేలా చేస్తాయి. ఈ కొవ్వు పదార్థాలు, ఫలకాలుగా ఏర్పడి, ధమని గోడలను ఇరుకుగా మార్చి, ప్రసరణకు ఆటంకాలను ఏర్పరుస్తాయి. ఇలా రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటుకు దారి తీస్తుంది. కావున, కొవ్వు ఆధారిత ఆహారాలకు దూరంగా ఉండండి.


Also Read: RGV Aasha Trailer: ఆశ మూవీపై ఆర్జీవీ ఏమంటున్నాడు


పరిశోధనల ప్రకారం, పైన తెలిపిన కారణాల వలన ఎక్కువ మంది గుండెపోటుకు గురవుతున్నారు. మీరు కానీ ఈ అలవాట్లను లేదా వ్యాధులను కలిగి ఉంటె వెంటనే వైద్యుడిని కలిసి తగిన సూచనలు పాటించండి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి