Niloufer Hospital Hyderabad: హైదరాద్ లో దారుణం.. 100 రూపాయల కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్ బాయ్

100 రూపాయల గురించి బాలుడు ప్రాణం తీసిన ఘటన హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. 100 రూపాయలు ఇచ్చారని బాలుడి ఆక్సిజన్ తొలగించి వేరే పేషంట్ కు పెట్టిన వార్డ్ బాయ్..   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2021, 01:02 PM IST
  • ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రిలో చేరిన బాలుడు
  • 100 రూపాయలు ఇచ్చారని వెంటిలేటర్ తొలగించిన వార్డ్ బాయ్
  • వార్డ్ బాయ్ ని సస్పెండ్ చేయమని తెలిపిన నిలోఫర్ సూపరింటెండెంట్
Niloufer Hospital Hyderabad: హైదరాద్ లో దారుణం.. 100 రూపాయల కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్ బాయ్

Ward Boy Cruelty for 100 Rupees in Niloufer Hospital: ప్రాణం విలువ తెలియని కొంత మంది ఆసుపత్రిలో చేసే దారుణాలు కారణంగా రోజు పదుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. వంద రూపాయల గురించి అభం శుభం తెలియని బాలుడు ప్రాణం పొట్టనబెట్టుకున్నాడు వార్డ్ బాయ్ ఘటన హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లిన మహ్మద్ ఆజంకు విషయం చెప్పిన వైద్యులు అడ్మిట్ చేయాలని, వెండిలీటర్లపై చికిత్స అందించాలని సూచించారు. వైద్యులు చెప్పిన తరువాత హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. 

Also Read: Corona Updates: అదుపులో కరోనా.. 24 గంటల్లో 12,830 కేసులు.. 446 మరణాలు నమోదు

ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మహ్మద్ ఖాజాకు చికిత్స నిమిత్తం ఆక్సిజన్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. పక్కనే ఉన్న మరో రోగి కూడా చికిత్స పొందుతున్న సమయంలో.. వార్డ్ బాయ్ కి వంద రూపాయలు ఇచ్చారు. అయితే వంద రూపాయలు తీసుకున్న వార్డ్ బాయ్ మహ్మద్ ఖాజాకు ఉన్న ఆక్సిజన్ వెంటిలేటర్ ను తీసి 100 రూపాయలు ఇచ్చిన రోగికి అమర్చి వెళ్ళిపోయాడు. 

అప్పటికే ఊపిరితిత్తుల సమస్యల తో భాదపడుతున్న ఖాజా ఊపిరి ఆడక చనిపోయాడు. ఒక 100 రూపాయల గురించి బాలుడి పట్ల కఠినంగా వ్యవహరించిన వార్డ్ బాయ్ పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. వంద రూపాయల కారణంగా తమ బాలుడుని చంపేశారని.. ఇంత దారుణానికి ఒడిగట్టినందుకు బాలుడి బంధువులు తీవ్ర ఆయాగ్రహానికి గురవుతున్నారు. అయితే బాలుడి మృతికి కారణమైన వార్డ్ బాయ్ ని సస్పెండ్ చేశామని సూపరింటెండెంట్ తెలిపారు. 

Also Read: Kaikala Satyanarayana Hospitalised : కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News