Auto Immune Disease: హషిమోటో థైరాయిడిటిస్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఆటో ఇమ్యూన్ అంటే మన శరీరం తనను తానుగా దాడి చేసుకునే వ్యాధి. సాధారణంగా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్‌లు వంటి బాహ్య వైరస్‌లతో పోరాడటానికి ఉపయోగపడుతుంది. కానీ ఆటో ఇమ్యూన్ వ్యాధులలో ఈ రోగ నిరోధక వ్యవస్థ తప్పుగా మన శరీరంలోని కణాలను శత్రువులుగా భావించి దాడి చేస్తుంది. దీని వల్ల థైరాయిడ్‌ సమస్య కలుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హషిమోటో వ్యాధిలో రోగ నిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిని లక్ష్యంగా చేసుకుంటుంది. థైరాయిడ్ గ్రంథి మెడ ముందు భాగంలో ఉండి మన శరీరంలోని జీవక్రియను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యాధిలో రోగ నిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిని నాశనం చేయడం వల్ల ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల మన శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.


హషిమోటో థైరాయిడిటిస్‌కు కారణాలు ఏమిటి?


కొన్ని జన్యువులు హషిమోటో వ్యాధికి ప్రమాద కారకాలుగా ఉంటాయి.  వైరస్‌లు, బ్యాక్టీరియా, కొన్ని రకాల మందులు వంటి పర్యావరణ కారకాలు కూడా ఈ వ్యాధిని ప్రేరేపించవచ్చు.  టైప్ 1 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఇతరవ్యాధులు ఉన్నవారిలో హషిమోటో వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.


హషిమోటో థైరాయిడిటిస్‌  లక్షణాలు ఏమిటి?


హషిమోటో వ్యాధి లక్షణాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటాయి. కొంతమందికి ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కొంతమందికి కనిపించే లక్షణాల్లో ఒకటి అలసట. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికి కూడా శరీరం అలసటగా ఉంటుంది. అలాగే ఉన్నటుంది బరువు పెరగడం కూడా హషిమోటో థైరాయిడ్‌ కు లక్షణం. అంతేకాకుండా కొంచెం గాలికి కూడా చలి అనిపిస్తుంది. కొంతమందిలో గ్యాస్‌, మలబద్ధకం వంటి సమస్యలు కలుగుతాయి. కొన్ని సార్లు చర్మం పొడిగా మారుతుంది.  హషిమోటో థైరాయిడ్‌ వల్ల జుట్టు రాలుతుంది. శరీరంలో నొప్పులు కలుగుతాయి. కీళ్ళు, వెన్ను నొప్పి అధికంగా కలుగుతాయి. 


హషిమోటో థైరాయిడిటిస్‌కు చికిత్స ఏమిటి?


హషిమోటో వ్యాధికి ప్రస్తుతానికి పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. కానీ మందుల ద్వారా థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలను నియంత్రించడం  వల్ల వ్యాధిని నిర్వహించవచ్చు. వైద్యులు సాధారణంగా లెవోథైరాక్సిన్ అనే మందును సూచిస్తారు. ఈ మందు థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయవలసిన హార్మోన్లను అందిస్తుంది. వీటితో పాటు జీవనశైలి, ఆహారంలో పలు మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఒత్తిడిని నియంత్రించడం, శరీరానికి కావాల్సిన నిద్ర పోవడం చాలా ముఖ్యం. 


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.