The History Of Valentines Day: ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు.  ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఈ వాలెంటైన్స్‌ డేను చేసుకుంటారు. ప్రేమికులు ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఎందుకని ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును జరుపుకుంటారనేది ఆసక్తికరం. ఈ రోజు మాత్రమే ప్రేమికుల రోజు ఎందుకు చేస్తారని చాలా మందిలో ఈ ప్రశ్న కలుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

❤️ ఈ వాలెంటైన్స్‌ డే జరుపుకోవడానికి చాలా కరణాలు ఉన్నాయి. ఈ రోజు గురించి ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో చెబుతుంటారు. అయితే అన్ని కథల కంటే వాలెంటైన్ స్టోరీనే ఎంతో ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. 


❤️ ఈ కథ క్రీస్తుశకం  270లో జరిగింది. రోమ్‌లోని వాలెంటైన్స్ అనే క్రైస్తవ గురువు ఉండేవాడు. హింస, స్వార్థం, ద్వేషంపై పోరాడటానికి ప్రేమను మించిన ఆయుధం ఏది లేదని వాలెంటైన్స్ అభిప్రాయం. అందుకే తను రోమ్‌లో నివసించే యువతీ , యువకులకు ప్రేమ పుట్టేందుకు తన వంతు ప్రయత్నం చేసేవాడని చర్రిత చెబుతుంది. అక్కడితో ఆగకుండా ప్రేమలో పడిన వారికి.. ప్రేమలో మునిగిపోయిన వారికి దగ్గరుండి మరీ వివాహం జరిపించేవాడట.


❤️ దీని వల్ల వాలెంటైన్స్‌కి రోజురోజుకు అభిమానులు పెరిగిపోవడంతో రోమ్‌ రాజు అయిన క్లాడియస్‌కి భయం పట్టుకుంది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారుచేస్తున్నాడన్న అభియోగంపై క్లాడియస్‌ వాలెంటైన్‌కి ఫిబ్రవరి 14న మరణశిక్ష విధించాడు. అతడు మరణించిన రెండు దశాబ్దాలకు క్రీస్తుశకం 496లోని పోప్‌, గెలాసియస్స్‌ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డేగా ప్రకటించాడు. అంతేకాకుండా వాలెంటైన్‌ అభిమానుల్లో క్లాడియస్‌ కుమార్తె కూడా ఉండటం పెద్ద విశేషం. అప్పటి నుంచి ఈ రోజును ప్రపంచం ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటోంది.


❤️ ఫిబ్రవరి 14న ప్రత్యేకత: 


ప్రేమ కోసం ఎందరో గొప్ప ప్రేమికులు పోరాటాలు చేశారు. వాలెంటైన్‌ కారాగారంలో ఉన్నప్పుడు జైలర్ కూతురితో ప్రేమలో పడిపోయాడట. తను  చనిపోయే ముందు తన ప్రియురాలి గురించే తలచుకుంటూ 'యువర్ వాలెంటైన్' అని లవ్ లెటర్ రాశాడు. ఈ యువర్ వాలెంటైన్‌ అనేది ప్రేమకు నిర్వచనంగా మారిపోయిందని చర్రితకారులు చెబుతున్నారు. అలా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. 


Also read: Strange Village: ఈ ఊరిలో ఆడవాళ్లే లేరు.. అందరూ మగవాళ్లే.. ఎందుకో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook