White Hair Problem Solution: వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. మరికొందరిలో అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి జుట్టు నెరిసిపోవడం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు పలు ఆయుర్వేద రెమెడీస్ వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు తగ్గడ మేకాకుండా జుట్టు రాలడం సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉసిరి పొడి రెమెడీస్‌తో సులభంగా తెల్ల జుట్టుకు చెక్‌ పెట్టొచ్చు!:
ఒక చెంచా ఉసిరి పొడిని రెండు గుంటల నీటిలో కలపండి. దీనిని జుట్టుకు అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన 15 నుంచి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే శాశ్వతంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్య కూడా తగ్గుతుంది. 


[[{"fid":"272301","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


రెండవ రెమెడీస్‌:
ఎండిన 25 గ్రాముల ఉసిరి చూర్ణాన్ని తీసుకుని.. రాత్రంత నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత రోజు నీటిని వడకట్టి తేలికపాటి చేతులతో జుట్టు మూలాల్లో మసాజ్‌ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పొడి జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. 


Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్


[[{"fid":"272302","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఉసిరి నూనె:
దీని కోసం ముందుగా ఉసిరికాయను చూర్ణం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 500 గ్రాముల నల్ల నువ్వుల నూనెలో చూర్ణం వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. ఇలా మరిగించిన తర్వాత మిశ్రంలా తయారవుతుంది. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టుకు వినియోగిస్తే సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook