White Hair Problem: ఆధునిక పోటీ ప్రపంచం, ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్ కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడటానికి కారణంం కూడా ఇదే. జుట్టు నల్లబడేందుకు అద్భుతమైన చిట్కా మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల హెయిల్ ఫాల్, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా జుట్టు తెల్లబడటం సర్వ సాధారణమైపోయింది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఇప్పటివరకూ సరైన వైద్య విధానమే లేదు. మార్కెట్‌లో హెయిర్ కేర్‌కు సంబంధించిన సమస్యల్ని దూరం చేసే ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. కానీ వాటిలో ఉండే కెమికల్స్ కారణంగా..జుట్టుకు మరింత హాని కలుగుతుంది. ఈ క్రమంలో అద్భుతమైన చిట్కా వైద్యంతో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నూనె, ఉసిరి మిశ్రమంతో జుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుందంటున్నారు.


1. కొబ్బరినూనెలో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇది జుట్టుకు చాలా అవసరం. అటు జుట్టుకు పోషక పదార్ధాలు అందించేందుకు నూనెలో ఉసిరి జ్యూస్ కలిపి ఆ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మరింత పటిష్టమౌతాయి. వారానికి 3 సార్లు ఇలా చేయాలి. 


2. చాలామంది జుట్టు తక్కువ వయస్సుకే తెల్లబడిపోతుంటుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు ఉసిరి పౌడర్, కొబ్బరి నూనె కలిపి తలకు రాయాలి. దీనికోసం కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసి..అందులో ఉసిరి పౌడర్ కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు మెదళ్లలో బాగా రాయాలి. కాస్సేపు మస్సాజ్ చేసి ఓ అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి కనీసం రెండుసార్లు ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య పోతుంది. 


3. మీ తలలో డేండ్రఫ్ సమస్య ఉంటే ఉసిరికాయ, కొబ్బరి నూనెతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీనికోసం ముందుగా ఉసిరి జ్యూస్‌లో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకోవాలి, ఓ అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే డేండ్రఫ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


Also read: Raw Milk: పచ్చిపాలు వర్సెస్ ఉడికించిన పాలు, ఏది ఆరోగ్యానికి మంచిది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook