COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

White Hair To Black With Beetroot Hair Dye: ప్రస్తుతం చాలా మంది జుట్టు రంగును మార్చుకోవడానికి, స్టైల్‌గా కనిపించడానికి మార్కెట్‌లో లభించే వివిధ రసాయనాలతో కూడిన రంగులను వినియోగిస్తారు. వీటిని వినియోగించడం మంచిదేనా? అయితే తరచుగా రసాయనాలతో కూడిన రంగులను వినియోగించడం వల్ల భవిష్యత్‌లో జుట్టు తీవ్రంగా దెబ్బతినే ఛాన్స్‌లు ఉన్నాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. దీనికి బదులుగా జుట్టుకు రంగును తెప్పిచేందుకు బీట్‌రూట్‌ను కూడా వినియోగించవచ్చట. బీట్రూట్‌తో తయారు చేసిన హెయిర్‌ మాస్క్‌ను వినియెగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా జుట్టు రాలడం కూడా సులభంగా తగ్గుతుంది.  


ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు జుట్టుకు బీట్‌రూట్‌తో తయారు చేసిన హెయిర్‌ మాస్క్‌ను వినియోగించడం వల్ల జుట్టు ఎరుపుతో పాటు నలుపు బుడిద రంగులోకి మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. జుట్టుకు సహజసిద్ధమైన రంగును వాడాలనుకునేవారు బీట్‌రూట్‌ హెయిర్‌ మాస్క్‌ను అప్లై చేసుకోవచ్చు. ఇది జుట్టుకు ఎంతో సురక్షితమైనదే కాకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. 


బీట్‌రూట్‌ మాస్క్‌ హెయిర్‌ హోం రెమెడీ తయారి విధానం:
ఈ మాస్క్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా 2 బీట్‌రూట్‌లు తీసుకోవాల్సి ఉంటుంది.
దీంతో పాటు 1 టీస్పూన్ అల్లం రసం తీసుకోవాలి.
వీటిని ఓ బౌల్‌లో మిక్స్‌ వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి. 
ఇలా మిక్స్‌ చేసుకున్న తర్వాత రెండు చెంచాల ఆలివ్ నూనె వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని జుట్టుకు అప్లై చేసుకోవాలి.
బాగా అప్లై చేసిన తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి.
ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టుకు 1 గంట నుంచి 2 గంటల పాటు ఆరనివ్వాలి.
ఇలా చేసిన తర్వాత సాధరన షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


బీట్‌రూట్‌ ప్రత్యేక హెయిర్‌ డై తయారి విధానం:
ఈ హెయిర్‌ డైను తయారు చేయడానికి ముందుగా 3 నుంచి 4 బీట్‌రూట్‌లను తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈ ముక్కలను గ్రైడర్‌లో వేసి బాగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
ఇలా మిశ్రమం తాయరైయ్యక అందులోనే 1 చెంచా తేనెను కలపాల్సి ఉంటుంది.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 
ఈ మిశ్రమం అప్లై చేయడానికి ముందుగా జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
జుట్టుకు ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 3 నుంచి 4 గంట పాటు అలాగే ఉంచాలి.
ఆ తర్వాత జుట్టును షాంపూతో శుభ్రం చేయాలి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి