Soapberries Seed For White Hair To Black Hair: చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య తెల్ల జుట్టు.. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, జీన్స్ కారణంగా చాలామందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది. అయితే యువత తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన హెయిర్ డైస్ ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఖరీదైన చికిత్స కూడా చేయించుకుంటున్నారు. ఇలా విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ తెల్ల జుట్టు నల్ల రంగులోకి మారినప్పటికీ కేవలం కొంతకాలమే ఉంటుంది.. ఆ తర్వాత ఎప్పటిలాగా తెల్లగా మారుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాశ్వతంగా తెల్ల జుట్టు సాధారణ ఆయుర్వేద చిట్కాలతో నల్లగా మార్చుకోవడం సులభమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వారు సూచించిన కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించడం వల్ల తెల్ల జుట్టును శాశ్వతంగా నల్ల జుట్టు గా మార్చుకోవచ్చని వారంటున్నారు. అయితే తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న చిట్కాలు ఏంటో వాటిని ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్లను వినియోగించకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో అధికమవుతాదులో రసాయనాలు ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు వినియోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారినప్పటికీ భవిష్యత్తులో అనేక రకాల జుట్టు సమస్యలు రావచ్చు. దీంతోపాటు ఈ రసాయనాలతో కూడిన ప్రోడక్ట్లను వినియోగించడం వల్ల బట్టతల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే శాశ్వతంగా తెల్ల జుట్టును పొందడానికి ఆయుర్వేదనపుణులు సూచించిన విధంగా కుంకుడుకాయని వినియోగిస్తే నల్ల జుట్టు పొందడం ఖాయం అంటున్నారు. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్


కుంకుడుకాయలో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యలకు ప్రభావంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా చుండ్రు వంటి సమస్యలతో బాధపడేవారు కుంకుడు కాయలను దంచి నీటిలో నానబెట్టి తల స్నానం చేసే క్రమంలో షాంపూకు బదులుగా వీటిని వినియోగించడం వల్ల కుదుళ్లలో ఉన్న మురికి పోయి చుండ్రు సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. 


ఇక తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు కుంకుడుకాయను పగలగొట్టి ఆ గింజలోపల ఉన్న పలుకులను ఎండబెట్టి.. కుంకుడు తోలు తో పాటు పలుకులను గ్రైండ్ చేసి ఓ డబ్బాలో భద్రపరచుకొని వినియోగించవచ్చు. అయితే దీనిని వినియోగించే ముందు ఒక కప్పు నీటిలో ఇలా భద్రపరచుకున్న కుంకుడు పొడిని కలుపుకొని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనిచ్చి తలస్నానం చేస్తే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి