White Hair Turn Black Naturally: ప్రస్తుతం తెల్ల జుట్టు రావడం సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు 60 సంవత్సరాలు నిండిన వారిలో తెల్ల జుట్టు వచ్చేది కానీ ఇప్పుడు యువతలో కూడా సులభంగా తెల్ల జుట్టు వస్తుంది. ఆధునిక జీవనశైలి అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం శరీరంలోని పోషకాల లోపం జన్యుపరమైన సమస్యలు ఇలా ఒకటి కాదు రెండు కాదు తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో తెల్ల జుట్టు రావడమే కాకుండా జుట్టు సన్నబడిపోయి, నిర్జీవంగా కూడా తయారవుతోంది. దీని కారణంగా సులభంగా బట్టతల వచ్చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్ల జుట్టు రావడం పెద్ద సమస్య కాకపోయినా బట్టతల రావడం మాత్రం సమస్యేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఖరీదైన చికిత్సలను పొందుతున్నారు. ఇకనుంచి ఇలా చేయించుకోనక్కర్లేదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే వారు సూచించిన కొన్ని చిట్కాలను పాటించి సులభంగా తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జుట్టు రాలడానికి కూడా తగ్గించుకోవచు. అయితే ఆ చిట్కాలు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా..


తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు ఆముదం నుంచి తీసిన నూనె ప్రతిరోజు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ నూనెలో జుట్టుకు కావాల్సిన అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఆముదం నూనెను ప్రతిరోజు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకోవడం వల్ల అతి తొందరలోనే ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీనిని ప్రతిరోజూ వినియోగించడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గి ఒత్తుగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



తెల్ల జుట్టు సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఉసిరి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును బలంగా చేయడమే కాకుండా తెల్ల జుట్టును సులభంగా నల్లగా మారుస్తాయి. అయితే తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉసిరి పొడిని నీటిలో కలిపి మిశ్రమంలా తయారు చేసుకొని, జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు అప్లై చేయడం వల్ల సులభంగా ఎప్పటిలాగా తెల్ల జుట్టునుంచి నల్ల జుట్టును పొందుతారు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter