White Pumpkin Juice Benefits: తెల్ల గుమ్మడికాయ రసం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా..!
White Pumpkin Juice Benefits: తెల్ల గుమ్మడికాయలో చాలా రకాల విటమిన్లు ఉంటాయి. కావున శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో ఐరన్, ఫాస్పరస్ అధిక పరిమాణంలో ఉంటాయి.
White Pumpkin Juice Benefits: తెల్ల గుమ్మడికాయలో చాలా రకాల విటమిన్లు ఉంటాయి. కావున శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో ఐరన్, ఫాస్పరస్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది శరీరంలో ఉన్న కాలేయం సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా తెల్ల గుమ్మడితో చేసిన రసం వల్ల శరీరానికి వచ్చే చాలా రకాల ప్రయోజనాల గురించి ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఈ రసం తాగడం వల్ల కాలేయ సమస్యలు తొలగిపోతాయని వారు చెబుతున్నారు. ఇది శరీర సమస్యలకు దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. తెల్ల గుమ్మడికాయ రసం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తెల్ల గుమ్మడికాయ రసం ఎలా తయారు చేయాలి..?
సీజన్‌లో వచ్చే పండ్లు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తెల్ల గుమ్మడి రసం ఆరోగ్యానికి దివ్యౌషధంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఒక తెల్ల గుమ్మడికాయను తీసుకొని, పొట్టు తీసి గ్రైండర్‌లో వేసి బాగా జ్యూస్ చేయండి. ఇలా తయారు చేసిన రసాన్ని ఇప్పుడు మీరు తాగవచ్చు.
కాలేయానికి కలిగే ప్రయోజనాలు:
కాలేయంలో వేడి పెరిగినప్పుడు, కడుపులో మంట, చర్మంలో మంట, ఛాతీలో మంట వంటి సమస్యల నుంచి విముక్తి పొందేందుకు తెల్ల గుమ్మడికాయ రసం తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల ముఖంపై మొటిమలు, దద్దుర్లు తొలగిపోయే అవకాశాలున్నాయి.
మెదడుకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది:
మెదడుకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు.. మైగ్రేన్ పేషెంట్లుగా మారిన వారు తప్పకుండా తెల్ల గుమ్మడికాయ రసం తాగాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా అవ్వడమే కాకుండా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad Rape: హైదరాబాద్‌లో మరో దారుణం.. 14 ఏళ్ల బాలికపై 21 ఏళ్ల యువకుడి రేప్..
Also Read: Cheating Case: అతనికి 50.. ఆమెకు 25... వలపు వల విసిరి టెక్కీని బోల్తా కొట్టించిన యువతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook