Who Should Avoid Guava: మన ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని రకాల పండ్లను తీసుకోవాలి. ముఖ్యంగా సీజన్‌లో దొరికే ప్రతి పండు తీసుకోవాల్సి ఉంటుంది. పండ్లులో జామ పండు అందరికి నచ్చే పదార్థం. చాలా పోషకాలు కలిగిన ఒక మంచి పండు. అయితే కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు జామ పండు తినకూడదు లేదా జాగ్రత్తగా తినాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదు. దాని వల్ల కలిగే సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జామ పండు తినకూడదలసిన వ్యక్తులు:


జీర్ణ సమస్యలు ఉన్నవారు:


జామ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ జామ పండ్లు తింటే మలబద్ధకం, కడుపులో నొప్పి, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి.


గుండెల్లో మంట:


 జామ పండులో విటమిన్ సి, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు జామ కాయను తక్కువ మోతాదులో తీసుకోవాలి.


డయాబెటిస్ ఉన్నవారు:


డయాబెటిస్ పేషెంట్లు జామ కాయను తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.


జలుబు, ఫ్లూ ఉన్నవారు:


జలుబు, ఫ్లూ సమస్యలు ఉన్నవారు జామపండుకు దూరంగా ఉండాలి. లేదంటే ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి.


పంటి నొప్పి ఉన్నవారు:


 పంటి నొప్పితో బాధపడుతున్నట్లయితే, ఈ పండును తినకుండా ఉండటం మంచిది.


గర్భిణీ స్త్రీలు:


గర్భిణీ స్త్రీలు జామ పండు తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.


పాలిచ్చే తల్లులు:


 పాలిచ్చే తల్లులు జామ పండు తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.


జామ పండును రాత్రి పూట తినకూడదు ఎందుకంటే ఇది జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మధ్యాహ్నం తినడం వల్ల అన్ని విధాల శ్రేయస్కరం.


ఎవరైనా జామ పండు తిన్న తర్వాత ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


జామ పండు తినడానికి ముందు జాగ్రత్తలు:


* జామ పండును శుభ్రంగా కడిగి తినాలి.
* జామ పండును తినే ముందు విత్తనాలను తీసివేయాలి.
* జామ పండును ఎక్కువగా తినకూడదు.
* జామ పండు తిన్న తర్వాత నీరు తాగాలి.


జామ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:


* జామ పండులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.
* జామ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* జామ పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


Also Read: LPG Cylinder Price Hike: ఫస్ట్‌రోజే సామాన్యులకు బిగ్ షాక్! ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు.. నగరాలవారీగా ధరలు ఎలా ఉన్నాయంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter