LPG Cylinder Price Hike: ఫస్ట్‌రోజే సామాన్యులకు బిగ్ షాక్! ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు.. నగరాలవారీగా ధరలు ఎలా ఉన్నాయంటే?

LPG Cylinder Prices Hiked: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) శుక్రవారం ఈ ధరల సవరణను ప్రకటించాయి.ఈ ధరలు నేడు అంటే మార్చి 1 నుంచే అమలు కానున్నాయి.

1 /6

 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) శుక్రవారం ఈ ధరల సవరణను ప్రకటించాయి. దీంతో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధర రూ.25.50 పెరిగింది. ఈ ధరలు నేడు అంటే మార్చి 1 నుంచే అమలు కానున్నాయి.  

2 /6

ఈ ధరల సవరణ తర్వాత 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర (రిటైల్) ఢిల్లీలో రూ.1795, ముంబైలో రూ.1960.  

3 /6

ఇదిలా ఉండగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అంటే 14 కిలోల సిలిండర్ ధర మాత్రం పెరగలేదు.. ప్రతినెలా మొదటిరోజు డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల సవరణ జరుగుతుంది.  

4 /6

డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రాష్ట్రాలవారీగా వేర్వేరుగా ఉంటాయి. స్థానిక పన్నులు, సిలిండర్ ధరల చివరి సవరణ ధరలు వంటి ఆధారంగా ఉంటాయి.   

5 /6

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లక్నో, అహ్మదాబాద్‌లో రూ.1816, చెన్నైలో రూ.1960, ఇండోర్‌ రూ.1901, జైపూర్‌ రూ.1818, ఆగ్రాలో రూ.1843 అందుబాటులో ఉంటుంది.  

6 /6

అంతేకాదు ATF ధరలు వరుసగా తగ్గించిన ఓఎంసీ విమాన ఇంధన ధరలను పెంచేసింది. ప్రస్తుతం లీటరు దాదాపు రూ.624,37 ఇవి కూడా నేటి నుంచే వర్తిస్తాయి.