Blood Sugar Levels: మారుతున్న జీవన శైలితో పటు మనం అనుసరించే ఆహార శైలి మరియు  జీవన విధానం కారణంగా చాలా మంది డయాబెటిస్ వ్యాధి బారినపడుతున్నారు. డయాబెటిస్ సమస్య కారణంగా బ్లడ్ షుగర్ పెరిగే సమస్య కూడా ఉంటుంది. కొంతమందిలో ఈ బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరుగుతుంది. దీని కారణంగా ఈ సమస్యతో బాధ పడేవారు భయాందోళనలకు గురై..  దీని కారణంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి నుండి మధుమేహ వ్యాధిగ్రస్థులు రక్షణ పొందడానికి శ్రద్ధ వహించాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కువగా నీళ్లు తాగాలి.. 
బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరిగినప్పుడు..  ఎక్కువగా నీరు త్రాగాలి. అలా తాగడం వల్ల  శరీరం సాధారణం స్థితికి చేరుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలోని అదనపు ద్రవం మూత్ర రూపంలో బయటకు వెళ్ళటం వలన శరీరానికి మేలు చేస్తుంది. కావున డయాబెటీస్ ఉన్న వారిలో బ్లడ్ షుగర్ స్థాయిలు పెరిగితే వెంటనే నీటిని తాగండి. 


ఎక్కువగా వ్యాయామం.. 
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి వ్యాయామం చేయడం చాలా అవసరం. బ్లడ్ షుగర్ అధికం అయినప్పుడు వ్యాయామం చేయడం వలన శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కావున మధుమేహ వ్యాధి గ్రస్తుల శరీరంలో చెక్కర స్థాయిలో పెరిగినపుడు తప్పక వ్యాయామాలను అనుసరించండి. 


Also Read: YSRTP vs Congress: కాంగ్రెస్‌లో విలీనానికి తెర, ఇక ఒంటరిగానే తెలంగాణ ఎన్నికల బరిలో


ఆహారపు అలవాట్లలో మార్పులు.. 
మాలో కొందరికి భోజన సమయం నిర్ణితంగా ఉండదు. దాని వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుంది. ఈ సమస్యల్లో బ్లడ్ షుగర్ పెరగడం కూడా ఒకటి. కావున భోజన సమయాన్ని మార్చుకోవడం చాలా అవసరం. 


ఒత్తిడిని జయించటం.. 
ఒత్తిడి వలన కూడా శరీర రక్తంలోని చెక్కర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. కావున స్ట్రెస్ కి గురయినపుడు వేరే ఏవైనా పనుల ద్వారా కానీ..  మెడిటేషన్.. అంకెలు లెక్కించటం ద్వారా కానీ ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఫలితంగా రక్తంలోని చెక్కర స్థాయిలు తగ్గి సాదారణ స్థితికి చేరుకుంటారు. 


సరైన సమయం పాటు నిద్ర.. 
సరైన సమయం పాటు నిద్ర లేకపోతే.. శరీరంలో చెక్కర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. కావున రోజులో 8 గంటల పాటు సరైన నిద్ర అవసరం. రోజులో తప్పనిసరిగా 8 గంటలు విశ్రాంతి తీసుకోవటం మరవకండి. 


Also Read: Solar Lunar Eclipse 2023: ఈ రాశులవారిపై 2 గ్రహాణాల ఎఫెక్ట్‌..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook