Why Black Grapes Costly: ఆకుపచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష ఎందుకు ఖరీదైంది? ఎప్పుడైనా ఈ లాజిక్ ఆలోచించారా ?
Why Black Grapes Costly Than Green Grapes: ద్రాక్ష మనలో చాలా మంది తినడానికి ఇష్టపడతారు. ఇవి రెండు మూడు రంగుల్లో కనిపిస్తాయి. కానీ, ఎక్కువశాతం మామూలు రకం అయిన గ్రీన్ గ్రేప్స్ కంటే నల్లద్రాక్ష ఖరీదు. ఇది ఎందుకో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?ఆరోగ్యపరంగా ద్రాక్ష ఎన్నో పోషకాలు కలిగినది.
Why Black Grapes Costly Than Green Grapes: ద్రాక్ష మనలో చాలా మంది తినడానికి ఇష్టపడతారు. ఇవి రెండు మూడు రంగుల్లో కనిపిస్తాయి. కానీ, ఎక్కువశాతం మామూలు రకం అయిన గ్రీన్ గ్రేప్స్ కంటే నల్లద్రాక్ష ఖరీదు. ఇది ఎందుకో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?ఆరోగ్యపరంగా ద్రాక్ష ఎన్నో పోషకాలు కలిగినది. అంతేకాదు ఈ గ్రీన్ గ్రేప్స్ తో ఇటీవల పేస్ మాస్క్ లు కూడా తయారు చేసుకోవడం సోషల్ మీడియాలో చూశాం. పోషకాల పరంగా కూడా ద్రాక్ష తినాలని వైద్యులు సూచిస్తారు. కానీ, మీరు ఎప్పుడైనా దీన్ని గమనించే ఉంటారు. మార్కెట్ లో వీటిని కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు గ్రీన్ గ్రేప్స్ కంటే బ్లాక్ గ్రేప్స్ ఖరీదు. ఇది ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా?
అయితే వీటి రుచిలో ఉండే భిన్నత్వం దాని ధరను ప్రభావితం చేస్తుందా? లేక ఈ పండు ఖరీదు కావడానికి మరో కారణం ఉందా? పచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష ఎందుకు ఎక్కువ ధర పలుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుపచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష ధర ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది ముఖ్యమైన విషయం ఎందుకంటే దాని ఉత్పత్తి ప్రక్రియ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. నల్ల ద్రాక్షను కొన్ని వాతావనణ పరిస్థితులలో మాత్రమే పండిచాల్సి ఉంటుంది. నల్ల ద్రాక్షకు ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, నేల అవసరం. చాలా చల్లని లేదా చాలా వేడి వాతావరణంలో వీటిని పెంచలేం. నల్ల ద్రాక్షకు సాపేక్షంగా ఎక్కువ శ్రద్ధ అవసరం. అందుకే నల్ల ద్రాక్షను ధర, దిగుబడి ఆధారంగా అధిక ధరకు విక్రయిస్తారు.
ఖరీదుకు కారణం..
గ్రీన్ గ్రేప్స్ కంటే ద్రాక్ష నల్ల ద్రాక్షకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాని సరఫరా కూడా డిమాండ్‌కు తగినంత సరిపోవడం లేదు. కాబట్టి ఆర్థిక ప్రమాణాల ప్రకారం ఇది వినియోగదారుల జేబుపై భారం పడుతుంది. అంతేకాకుండా, నల్ల ద్రాక్షను చేతితో పండించే ప్రక్రియ సాధారణంగా జరుగుతుంది. అదే పనిని యంత్రం ద్వారా చేస్తే ధరలు కాస్త తక్కువ. దీని ప్రత్యేక రకం ప్యాకింగ్ కూడా ఖరీదైనది.
Also read: Heart Problems: ఈ చిట్కాలు పాటించడం వల్ల గుండె సమస్యలకు చెక్!
ఆరోగ్య ప్రయోజనాలు..
నల్ల ద్రాక్ష అధిక ధరకు మరొక కారణం నల్ల ద్రాక్ష లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు. ఈ పండులో యాంటీఆక్సిడెంట్లతో సహా వివిధ పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ప్రయోజనాలను అందించడంలో బాగా సహాయపడుతాయి.
గుండె ఆరోగ్యం..
పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఇ చర్మం, జుట్టు అందాన్ని కూడా పెంచుతుంది. కంటి చూపు తక్కువగా ఉన్నవారు కూడా ఈ పండును తినడం మొదలుపెట్టండి. చూపు కూడా మెరుగుపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter