International Womens Day 2024: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు మొదలైంది? మార్చి 8 నే ఎందుకు జరుపుకుంటారు?
Women`s Day 2024: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సమాజాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర , ఇంటి పనులే కాకుండా సమాజంతో పాటు వివిధ రంగాల్లోనూ తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.
Women's Day 2024: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సమాజాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర , ఇంటి పనులే కాకుండా సమాజంతో పాటు వివిధ రంగాల్లోనూ తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. విద్య, సేవ, సైన్స్, టెక్నాలజీ ఇలా అనేక రంగాలలో ఆమె చేసిన కృషి చాలా ప్రత్యేకమైంది. దీనికి గుర్తింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి రోజు మహిళా దినోత్సవం వస్తుంది. స్త్రీ ఒక తల్లిగా, భార్యగా, చెల్లి, అక్కగా ఆమె బాధ్యతలకు గుర్తుగా ఆమెను గౌరవిస్తూ ఈ వేడుక జరుపుకుంటారు. అయితే, ఇది మార్చి 8నే ఎందుకు జరుపుకుంటారు తెలుసుకుందాం.
మహిళలు పురుషుల కంటే ఏ విషయంలోనూ తక్కువేం కాదు. ఈ సమాజంలో స్త్రీపురుషులిద్దరూ సమానమే స్వేచ్చ సమానత్వ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వారికీ కొన్ని ప్రత్యేక హక్కులున్నాయని గుర్తుగా వారికి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
అయితే, మొట్టమొదటిసారి 1908 లో మహిళా దినోత్సవం జరుపుకున్నారు. న్యూయార్క్ నగరంలో మహిళలందరూ ఈ వేడుక జరుపుకున్నారు. రెడీమేడ్ గార్మెంట్స్ కార్మికులపై జరుగుతున్న అణచివేతను ఖండిస్తూ దినోత్సవాన్ని ప్రారంభించారు. పని తగిన వేతనం డిమాండ్ చేశారు. అంతేకాదు ఓటు హక్కు కూడా మహిళలకు కల్పించాలని నిరసన చేపట్టారు.
ఇదీ చదవండి: తెలంగాణలో రేపటి నుంచి వరుసగా 3 రోజులపాటు స్కూళ్లకు సెలవులు..
ఆ తర్వాతి కాలంలో 1910 లో ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని క్లారా జెట్కిన్ ప్రతిపాదించారు. కొన్ని దేశాలు మహిళా దినోత్సవం జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాతి కాలంలో 1975 లో అధికారికంగా ఐక్యరాజ్యసమితి మార్చి 8 న మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ 'Inspire Inclusion'. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు జరుపుకుంటారు.అయితే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం వేడుకగా కాకుండా మహిళా సాధికారత కోసం నిరంతర ప్రయత్నంగా మారడం ముఖ్యం. మహిళలకు విద్య, ఆర్థిక స్వావలంబన, హక్కుల పరిరక్షణకు సమాజం నిరంతరం కృషి చేయాలి. ఈరోజు ప్రత్యేకంగా మహిళలు సాధించిన విజయాల గురించి మాట్లాడతారు.
ఇదీ చదవండి: మీ ముఖంపై పింక్ గ్లోయింగ్ లుక్ రావాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..
సమానత్వం, లింగ భేదాలు, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి కూడా ఈ రోజున అవగాహన కల్పిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యుల్లోని మహిళలకు ఈరోజు ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. వారికి సర్‌ప్రైజ్‌లు కూడా ఇవ్వండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter