Tulsi Leaves Benefits In Monsoon: భారతదేశంలోని చాలా ఇళ్లలో తులసి మొక్క ఒక సాధారణ దృశ్యం. దీని ఔషధ గుణాల కారణంగా ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తులసి ఆకులను నేరుగా తినడమే కాకుండా, కషాయాల రూపంలో, టీలో కలిపి, పొడిగా చేసి లేదా తులసి నీటి రూపంలో కూడా సేవించవచ్చు. అయితే వర్షకాలంలో తులసిని ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు రోగల బారిన పడకుండా సహాయపడుతుంది. అయితే ఈ మొక్కను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణంలోని మార్పుల కారణంగా కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడుతుంటాము. అందులో ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు చాలా సాధారణమైనవి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు తులసి టీ, నీరు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌, అంటీ వైరల్ లక్షణాలు అనారోగ్యకరమైన వైరస్‌లను, బ్యాక్టీరియా నుంచి పోరాడటంలో ఎంతో సహాయపడుతుంది. 


తులసి నీరు లేదా టీ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్ట్రిక్‌, ఊబరం వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే తులసి ఆకులను నమలడం వల్ల ఎన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసిలో ఉండే ఆరోగ్యగుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండా ఉండేలా రక్షిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు శరీరానికి ఎంతో సహాయపడుతాయి. 



తీవ్రమైన ఒత్తిడి సమస్యలతో బాధపడేవారు కొన్ని తులసి ఆకులతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల ఒత్తిడిని తొలగించుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే తులసి ఆకులను నమలడం వల్ల ఆందోళన లక్షణాలు తగ్గుతాయి. నోటి దూర్వసనతో బాధపడేవారు కూడా తలసి ఆకులను ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల దూర్వసన మాత్రమే కాకుండా నోటి పూత, పుళ్ళు, చిగుళ్ల వ్యాధి వంటి ఇతర నోటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో తులసిలో కూడి పేస్ట్‌ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


తులసిని ఎలా ఉపయోగించాలి:


తులసి ఆకులను నేరుగా తినవచ్చు లేదాటీ, జ్యూస్ లేదా స్మూతీలలో చేర్చవచ్చు.


తులసి ఆకులను ఆరబెట్టి పొడి చేసి, పొడి రూపంలో నిల్వ చేయవచ్చు. ఈ పొడిని టీ, పాలు లేదా నీటిలో కలిపి తాగవచ్చు.


తులసి నూనెను కొన్ని చుక్కల మోతాదులో నీటిలో లేదా టీలో కలిపి తాగవచ్చు.


గమనిక:


గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే మహిళలు తులసిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.


ఏదైనా వైద్య పరిస్థితి ఉన్న వ్యక్తులు తులసిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి