COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Winter Vegetables: చలికాలంలో వాతవరణంలో తేమ పెరిగి క్రీమి, కీటకాల వ్యాప్తి కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్య సంరక్షణ అనేది పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా వాతవరణంలో వచ్చే మార్పుల కారణంగా శరీరంలోని కూడా అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. కొంతమందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం కూడా చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొంతమందిలో దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా చలి కాలంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులైననా సులభంగా ఎదుర్కొవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. శీతాకాలంలో ప్రతి రోజు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన కొన్ని కూరగాయలను తీసుకోవడం వల్ల అన్ని రకాల అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు. 


బ్రోకలీ:
శీతాకాలంలో బ్రోకలీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్ల అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలు, గ్లాకోమా వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో లభించే విటమిన్ సి రోగనిరోధక శక్తిని దృఢంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా బ్రోకలిని క్రమం తప్పకుండా తీసుకుంటే కొల్లాజెన్ ఉత్పత్తి, గాయం నయానికి, ఐరన్‌ శోషణలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్లు A, C, E తో పాటు, ఫైబర్ కూడా లభిస్తుంది.


పాలకూర:
పాలకూరలో శరీరానికి కావాల్సిన విటమిన్ ఇ, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి శీతాకాలంలో వ్యాధికి కారణమయ్యే వైరస్లు, బ్యాక్టీరియా తొలగిస్తుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సిలతో పాటు అనేక యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి పాలకూరను క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల ఐరన్ లోపం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


వెల్లుల్లి:
వెల్లుల్లిని యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల వైరస్‌, ఇతర సూక్ష్మజీవుల నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే గుణాలు రోగనిరోధక వ్యవస్థ పెంచేందుకు కూడా సహాయపడతాయి. ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు లభిస్తాయి. దీని కారణంగా ఇన్ఫెక్షన్ల సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter