World Smile Day 2022: వరల్డ్ స్మైల్ డేను ఎందుక జరుపుకుంటారో తెలుసా..?
World Smile Day 2022: ప్రపంచ స్మైల్ దినోత్సవం ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ దినోత్సవ ప్రత్యేకతను ప్రపంచమంతా చాటి చెప్పేందుకే ప్రపంచ నవ్వు దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతేకాకుండా ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటారు.
World Smile Day 2022: మానసిక మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కనీసం గంటసేపైనా నవ్వాలని ఇటీవల అధ్యయనాలు చెప్పాయి. కేవలం నవ్వు మాత్రమే జీవితంలో ఆనందాన్నిస్తుంది. ఏ ఒత్తిడి అయినా నవ్వుతోనే తొలగిపోతుంది కాబట్టి నవ్వు జీవితంలో విడదీయరాని సంబంధం. మరొకరు నవ్వడానికి మీరు కారణమైనప్పుడు ఇది మరింత మంచిదని దీనివల్ల మీ తోటి వారు ఆనందం పొందుతారు. కాబట్టి నవ్వు నవ్వించు.. ఆరోగ్యంగా ఉండు అని పూర్వికులు చెబుతుండేవారు. అందుకే ఈ నవ్వుకు సంబంధించిన ప్రత్యేకమైన రోజును వరల్డ్ స్మైల్ డే గా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి శుక్రవారం ఈ నవ్వు దినోత్సవాన్ని జరుపుకుంటారు. అన్ని దినోత్సవాలకు ఉన్నట్టుగానే ఈ దినోత్సవాన్ని కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.
మీ మిత్రులకు వరల్డ్ హ్యాపీ స్మైల్ డే ను ఇలా తెలియజేయండి:
>>శాంత అనేది చిరునవ్వుతోనే ప్రారంభం అవుతుంది- మదర్ థెరిస్సా
>>ఒక చిరునవ్వుతో ఇతరుల హృదయాలను గెలవచ్చు- గోల్డ్ హాన్
>>చిరునవ్వు అనేది మన శత్రుత్వాన్ని నశింపజేసేది, కాబట్టి మీ శత్రువుల ముందు ఒక చిరునవ్వు నవ్వి వారి మనసులని దోచుకోండి
>>ఈరోజు కోసం, కొంచెం నవ్వండి- జేమ్స్ ఏ మార్ఫీ
ప్రపంచ స్మైల్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
అమెరికాలో మొదటిసారిగా 1963 లో ఈ ప్రపంచ స్మైల్ డే వేడుకలను జరుపుకున్నారు. హార్వే బాల్ అనే వ్యక్తి ఈ స్మైల్ సింబల్ ని ఆ రోజే ప్రపంచానికి అంకితం చేశాడు. అందరూ నవ్వాలని జీవితంలో నవ్వే ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన సూచించారు. అందుకే ప్రతి అక్టోబర్ మొదటి శుక్రవారం ప్రపంచ చిరునవ్వు దినోత్సవంగా జరుపుకోవాలని ఆయన భావించారు. దీంతో అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్మైల్ డే ను జరుపుకుంటున్నారు.
వరల్డ్ స్మైల్ డే ఇతర ప్రాముఖ్యతలు:
>>1963 లో హార్వే బాల్ స్మైలీ ఫేస్ ను కనుగొన్నారు.
>>1970లో ఈ స్మైలీ ఫేస్ ను రాజకీయంగా, చలనచిత్రాల్లో, కార్టూన్, సోషల్ మీడియాలో వినియోగించారు.
>>1990లో ఇంటర్నెట్ ఆవిర్భవించిన తర్వాత ఈ స్మైలింగ్ ఫేస్ కు ఎంతో ప్రాధాన్యత లభించింది. అంతేకాకుండా ప్రజాదారణ కూడా పొందింది.
>>1999లో వరల్డ్ స్మైల్ డే వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.
ప్రపంచ స్మైల్ డే దినోత్సవాలు అమెరికాలో ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. ఈ వేడుకలు 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ రోజున స్మైల్ సింబల్ ని కనుగొన్న బాల్ హార్వే అవార్డును కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది.
Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి