Worst Cooking Oil: మీ వంటల్లో ఈ ఆయిల్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీకు గుండెపోటు వచ్చే అవకాశం..
Bad Cooking Oil for Health: మనం సాధారణంగా ఏ కూర, పప్పు చేసినా వంటనూనె వాడతాం. ఇది లేనిదే ఏ పనికాదు. మన ఇళ్లలో సన్ ఫ్లవర్, పల్లీ, నువ్వులనూనె వంటివి వంటలకు ఉపయోగిస్తాం. అయితే, మీరు కచ్చితంగా దూరం పెట్టాల్సిన కొన్ని రకాల నూనెలు ఉన్నాయి.
Bad Cooking Oil for Health: మనం సాధారణంగా ఏ కూర, పప్పు చేసినా వంటనూనె వాడతాం. ఇది లేనిదే ఏ పనికాదు. మన ఇళ్లలో సన్ ఫ్లవర్, పల్లీ, నువ్వులనూనె వంటివి వంటలకు ఉపయోగిస్తాం. అయితే, మీరు కచ్చితంగా దూరం పెట్టాల్సిన కొన్ని రకాల నూనెలు ఉన్నాయి. దీంతో మీ ఆరోగ్యం ప్రాణాపాయంలో పడిపోతుంది. ఎందుకంటే ఇందులో కొవ్వు పెంచే గుండెకు హానికరం కలిగించే గుణాలు ఉంటాయట. మీరు కూడా ఈ నూనెలు వాడితే వెంటనే ఆపేయండి. అవి ఏంటో తెలుసుకుందాం.
వంటనూనె ఉపయోగించడం వల్ల కరిగే మన శరీరంలోకి ఫైబర్ ఖనిజాలను గ్రహిస్తాయి. అంటే విటమిన్ ఏ, డీ, ఇ, కే. ఆహారంలో నూనె వాడినప్పుడు ఈ విటమిన్స్ అన్ని ఆహారంలో కలిసి మనం తీసుకున్నాక జీర్ణవ్యవస్థకు చేరతాయి.
కార్న్ ఆయిల్..
ఈ నూనెను ఎట్టిపరిస్థితుల్లో మీ వంటల్లో వినియోగించకండి. ఇందులో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా కేన్సర్, ఆస్తామా, టైప్ 2 డయాబెటిస్, ఎథెరోస్ల్కోరోసిస్, ఎండోథిలియల్ డిస్ఫక్షన్‌కు కారణమవుతుంది.
సోయాబీన్..
ఇవి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. సోయాబీన్ ఆయిల్ ను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో మంట కూడా పెరుగుతుంది. అంతేకాదు దీంతో అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు.
కాటన్‌సీడ్ ఆయిల్..
ఇవి కాటన్ ప్లాంట్ గింజల ద్వారా తయారు చేస్తారు. ఇందులో కూడా అధిక శాతం ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాటన్ సీడ్ ఆయిల్ కు కూడా దూరంగా ఉండాలి. ఇది కూడా శరీర మంటకు కారణమవుతుంది.
ఇదీ చదవండి: మండే ఎండలకు ముఖానికి చల్లదనాన్ని అందించే కూలింగ్ మాస్కులు..
వెజిటేబుల్ ఆయిల్..
చాలా వరకు ఈ వెజిటేబుల్ ఆయిల్స్ మనం వినియోగించేవి బ్లెండ్ చేసి తయారు చేసినవి. ఇలాంటి నూనె తీసుకోవడం వల్ల కూడా మన శరీరంలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిపోతాయి.
హైడ్రోజెనరేటెడ్ ఆయిల్స్..
కొన్ని రకాల నూనెలు హైడ్రోజనరేషన్ పద్ధతిలో తయారు చేస్తారు. ఇవి కూడా శరీరానికి హానికరం. ఎందుకంటే ఈ ఆయిల్స్ ద్రవం నుంచి ఘన పదార్థంగా మారతుఉంది. ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచుతాయి. దీంతో మన గుండెకు ప్రమాదం పొంచి ఉంటుంది.
రైస్ బ్రాన్ ఆయిల్..
ఈ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఒమేగా 3, ఒమేగా 6 యాసిడ్స్ శరీరంలో సమతులన చేయకుండా చేస్తాయి. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇదీ చదవండి: మీ జుట్టుకు ఈ నేచురల్ ఆయిల్ పెట్టండి.. నమ్మలేని పెరుగుదలను చూస్తారు..
పామ్ ఆయిల్..
ఇందులో ఎక్కువ శాతం శాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. పామ్ ఆయిల్ మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణమవుతుంది. దీంతో గుండె సమస్యలకు వస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter