High Cholesterol Symptoms: ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఆహార జీవన శైలి వలన గుండెలో కొవ్వు పేరుకుపోతుంది. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ రక్తంలో కొవ్వు స్థాయిలు పెరిగి, చిక్కగా మారుతుంది. ఫలితంగా రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చెడు పెరగడం మాత్రం ఖాయం. ఇలా చేయడం వల్ల ధమనులలో అడ్డు ఏర్పడి రక్తపోటు నియంత్రణ తప్పుతుంది. దీని కారణంగా గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వీటి వల్ల ప్రాణానికి కూడా ప్రమాదం వాటిల్లుతుంది. శరీరంలో పెరిగే కొలెస్ట్రాల్ లక్షణాలను కొన్ని సంకేతాల ద్వారా గుర్తించాలి. ఈ సంకేతాలు గమనించిన వెంటనే వైద్యుడిని కలవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కువ చెమటలు 
మనకి చెమటలు పట్టడం అనేది చాలా సాధారణం. కానీ, ఎక్కువగా చెమటలు పడితే అది శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ కి ఒక సంకేతం. కావున వెంటనే రక్త పరీక్ష చేసుకోవడం చాలా చాలా అవసరం. మీకు గానీ ఊరికే చమటలు పడితే వెంటనే వైద్యుడిని కలవండి. 


ఊబకాయం  
శరీర బరువు పెరుగుతుంది అంటే.. అనేక ఆరోగ్య సమస్యలకు చేరువ అవుతున్నామని అర్థం. అధిక బరువు వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  కావున బరువు తగ్గడం కోసం తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవడం మంచిది. 


Also Read: Sreeleela : ఫైనల్ గా బాలకృష్ణ సహాయంతో.. తనంటే ఏంటో రుజువు చేసుకున్న శ్రీలీల..


ఛాతీలో నొప్పి 
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సాధారణంగా వచ్చే సమస్య ఛాతీ నొప్పి. తరచుగా ఛాతీ నొప్పి వస్తుంటే.. పరీక్షలు చేయించుకోవడం మరియు తగిన జాగ్రత్తలను తీసుకోవడం అవసరం. ఛాతినొప్పి గుండె పోటుకు గురవ్వబోతున్నామని తెలిపే ఒక లక్షణం. 


కాళ్ళ నొప్పులు  
శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే..  కాళ్లల్లో నొప్పి ఉంటుంది. ఎందుకంటే ధమనుల్లో బ్లాకేజ్ ఏర్పడడం వల్ల కాళ్ళ వరకు రక్తం సరఫరా అవ్వదు,దీని వల్ల నొప్పి పెరుగుతుంది.  


పసుపు దద్దుర్లు  
చాలా సార్లు చర్మం పై పసుపు రంగులో దద్దుర్లు ఏర్పడతాయి. ఇది అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణం. కావున సమయానికి ముందే జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.


Also Read: Minister KTR: కేసీఆర్‌ను తెలంగాణలోనే ఖతం చేయాలనే కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..