Astadigbandanam: `అష్టదిగ్భంధనం` రివ్యూ.. ప్రేక్షకులను `దిగ్భంధనం` చేసిందా..?
మంచి మంచి కథలతో వచ్చిన సినిమాలకి ప్రేక్షకుల నుండి ఎప్పటికపుడు ఆదరణ లభిస్తూనే ఉంటుంది. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన `అష్టదిగ్భంధనం` సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందా.. లేదా అనేది ఇపుడు చూద్దాం!
నటీనటులు: సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు.
రచన - దర్శకత్వం: బాబా పి.ఆర్,
నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్,
మ్యూజిక్: జాక్సన్ విజయన్
కెమెరా: బాబు కొల్లబత్తుల
ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి బొంతల,
ఫైట్స్: రామ్ క్రిషన్, శంకర్ ఉయ్యాల,
లిరిక్స్: శ్యామ్ కాసర్ల, పూర్ణ చారి,
ఆర్ట్: వెంకట్ ఆరే
థ్రిల్లర్ జోనర్ కి చెందిన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే మరియు ట్విస్టులతో నడిపిస్తే ఆడియన్స్ తప్పకుండా విజయాన్ని అందిస్తారు.ఈ కోవకి చెందిన సినిమానే 'అష్టదిగ్భంధనం'. 'ఎ గేమ్ విత్ క్రైమ్' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఇచ్చిన ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగా.. క్రైమ్స్‌తో కూడిన ఒక గేమ్‌లా సినిమా ఉంటుంది. ‘సైదులు’ అనే సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయిన బాబా పీఆర్ రెండో సినిమాకే ఇలాంటి థ్రిల్లర్ కథను ఎంచుకోవడం గ్రేట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ‘రచ్చ’ సినిమాలో జూనియర్ తమన్నాగా నటించిన విషిక కోట హీరోయిన్ గా నటించారు. పలు లఘు చిత్రాలు మరియు కొన్ని సినిమాల్లో నటించిన సూర్య భరత్ చంద్ర ‘అష్టదిగ్భంధనం’ హీరోగా నటించాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు చూద్దాం..
కథ:
ఇక కథ విషయానికి వస్తే.. శంకర్ అనే రౌడీ షీటర్.. తోటి రౌడీ షీటర్ రాజకీయ నాయకుడిగా మారి తననే అవమానిస్తుంటే.. శంకర్ ఈగో దెబ్బతింటుంది. తను కూడా ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటాడు. ఆ సమయంలో అధికారంలో ఉన్న పార్టీకి రూ. 50 కోట్లు చెల్లించి.. ఎమ్మెల్యే టికెట్ కొనటానికి సిద్ధమవుతాడు. దాని కోసం పక్కా ప్లాన్ వేస్తాడు. ఎమ్మెల్యే అవటానికి రూ. 50 కోట్ల కోసం ఏ పథకం పన్నాడు.. ? ఈ పథకంలో హీరో-హీరోయిన్లు ఎలా ఇరుక్కున్నారు..? మంత్రి.. రౌడీ షీటర్ శంకర్‌కు ఇచ్చిన 100 కోట్లు ఏమయ్యాయి..? అసలు ఈ స్కెచ్ ఎవరు ఎవరికీ వేశారు..? చివరికి ఏం అయింది.. ? అని తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే!
Also Read: AP Skill Case: చంద్రబాబు చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు, తెరపై సీబీఐ దర్యాప్తు, రిమాండ్
విశ్లేషణ:
ఈ సినిమా ట్రైలర్ లోనే చెప్పారు "ఈ యుద్ధం రాజ్యం కోసమో.. రాణి కోసమే జరిగేది కాదని.. ఇద్దరు వ్యక్తుల అహం వల్ల జరిగేదని". ఈ విషయం సినిమాలో మాత్రం పక్కాగా కనిపించింది. బాబాకు దర్శకుడికి ఇది రెండో సినిమానే.. కానీ తన స్కీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న కొన్ని పాత్రలకు సస్పెన్స్ క్రియేట్ చేసాడు దర్శకుడు.. వాటికి కన్‌క్లూజన్ సెకెండాఫ్‌లో ఇచ్చాడు. కానీ ఫస్ట్ హాప్ లో ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ విషయానికి వస్తే.. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఎవరు ఊహించని విధంగా ఉంటుంది.
ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే.. ఏ క్షణం ఏం జరుగుతుందా అని ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకెండాఫ్‌లో దర్శకుడు ఎక్కువ ట్విస్టులను ప్లాన్ చేశాడు. ట్రైలర్ చూసి.. ఇదేదో క్రైమ్ కథో, లస్ట్ స్టోరీనో అనుకునేవాళ్లకు సినిమా చూస్తే ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. అక్కడక్కడ ఒకట్రెండు లాజిక్స్‌ను వదిలేస్తే ఓవరాల్‌గా సినిమా బాగుంది.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాలో హీరోగా నటించిన సూర్య భరత్ చంద్ర.. నటనతో పర్వాలేదనిపించాడు. ఇక హీరోయిన్ గా నటించిన విషిక.. అందచందాలతో ప్రేక్షకులను ఆకర్షించటమే కాకుండా.. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. రౌడీ షీటర్ శంకర్ పాత్రలో.. అతను విలనిజం బాగా పండించాడు. మంత్రి పాత్రలో.. అతను కూడా తన పాత్రకు న్యాయం చేకూర్చారు. ఇక మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఈ సినిమాలో నటించిన వాళ్లందరూ కొత్తవారే అయినప్పటికీ.. దర్శకుడి ఏం చూపించాలి అనుకున్నారో అది తెరపైకి తీసుకువచ్చారు అనే చెప్పాలి.
చివరిగా: థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడేవారు పక్కాగా అష్టదిగ్భంధనం సినిమా చూడాల్సిందే!
రేటింగ్: 3/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook