Parakramam: ఆసక్తి రేకిస్తోన్న బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ లేటెస్ట్ సాంగ్.. ఈ నెల 22న విడుదల..
Parakramam Movie: BSK మూవీస్ పతాకంపై బండి సరోజ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ లీడ్ రూల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన డ్రీమ్ సాంగ్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
Parakramam Movie: గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ నటులు వస్తున్నారు. ఈ కోవలో హీరోగా నటిస్తూ డైరెక్షన్, ప్రొడ్యూసర్ గా సత్తా చూపించడానికీ రెడీ అవుతున్నాడు బండి సరోజ్ కుమార్. ఈ సినిమాక బీఎస్ కే మెయిన్ స్ట్రీమ్ (BSK) పతాకంపై తెరకెక్కింది. ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమాను ఆగష్టు 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘డ్రీమ్’ సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటను బండి సరోజ్ కుమార్ రాసి సంగీతం అందించడం విశేషం.
శ్రీ వైష్ణవి గోపరాజు అందంగా ఈ పాటను ఆలపించారు. ఈ సాంగ్ లిరిక్స్ విషయానికొస్తే.. ‘వచ్చాడులే పరాక్రమం’ .. నా కన్నె మనసు చేరే కొత్త సంగమం.. తెచ్చాడులే పరాక్రమం.. అంటూ సాగే ఈ పాట యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. నా చిట్టి గుండెలో వింత యవ్వనం, అంటూ అమ్మాయి మనసులో భావాలను మెలిపెట్టేలా ఈ పాట ఉంది.
శ్రీ వైష్ణవి గోపరాజు అందంగా పాడారు. ఈ సాంగ్ ఎలా ఉందో చూస్తే..'వచ్చాడులే పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త సంగమం...తెచ్చాడులే పరాక్రమం.. నా చిట్టి గుండెలోకి వింత యవ్వనం...' అంటూ అమ్మాయి తన మనసులోని తొలిప్రేమ భావాలను చెప్పేలా లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.యాక్షన్ కమ్ లవ్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు సెన్సార్ వాళ్లు ఈ సినిమా చూసి ఎమోషన్ తో కూడిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టేనర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చెబుతున్నారు. ఈ సినిమా బండి సరోజ్ కుమార్.. చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్ సరసన శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శశాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.
టెక్నికల్ టీమ్
బ్యానర్ : బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్,కథ, కథనం, మాటలు,ఎడిటర్, సంగీతం, లిరిక్స్, నిర్మాత, దర్శకుడు - బండి సరోజ్ కుమార్
సినిమాటోగ్రఫీ - వెంకట్ ఆర్ ప్రసాద్, సౌండ్ డిజైన్ మరియు మిక్సింగ్ : కాళీ ఎస్ ఆర్ అశోక్, కలరిస్ట్ - రఘునాథ్ వర్మ, ఆర్ట్ : ఫణి మూసి, ఫైట్స్ - రాము పెరుమాళ్ల, రవి శ్రీ నృత్య రీతులు సమకూర్చారు.
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter