Weekend: డిఫరెంట్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న`వీకెండ్` మూవీ.. ఫస్ట్ షెడ్యూల్ అట్టహాసంగా ప్రారంభం.. .
Weekend First Schedule: వి ఐ పి శ్రీ కథానాయకుడిగా.. ప్రియా దేషపాగ కథానాయికగా యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘వీకెండ్’. శ్రీరాము రచయతగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాన ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐడీ భారతీ నిర్మిస్తున్నారు. పూర్తి కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఈ బుధవారం చీరాలలో అట్టహాసంగా ప్రారంభమైంది.
Weekend First Schedule: ఆంధ్ర ప్రదేశ్ లోని చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. దర్శక నిర్మాతల ఆధ్వర్యంలో ఎంతో మంది ప్రజలు ఈ షూటింగ్ కు హాజరయ్యారు. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో ఢిపరెంట్ మూవీ నిలవబోతున్నట్టు చెప్పారు.
ఎన్ ఆర్ ఐ లేళ జయ ఫస్ట్ కెమెరా రోల్ చేయగా.. సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ ఈ సినిమా ఫస్ట్ షాట్ కు మొదట క్లాప్ కొట్టారు. షూట్ మొదలు పెట్టిన అనంతరం ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ అంతా చీరాల లోనే షూటింగ్ చేయబోతున్నట్టు చిత్ర దర్శక, నిర్మాతలు ప్రకటించారు.
ఈ సినిమాలో వి ఐ పి శ్రీ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అంతేకాదు ఈ చిత్రంలో ప్రియ దేషపాగ కథానాయికగా ఇండ్రడ్యూస్ కాబోతుంది. అజయ్ మరియూ ఎస్తర్ ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు డెబోర, యోగి ఖత్రే, సునిత, జబర్దస్త్ అశోక్, తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాను ఖడ్గదార మూవీస్ బ్యానర్ పై ఐడీ భారతీ నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈశ్వర్, నిఖిత ఈ సినిమాకు సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు రాము బీ దర్శకత్వం వహిస్తున్నారు. యూఎస్ విజయ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఎన్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఈఎన్ స్టూడియో ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter