Dirty Fellow Pre Release Highlights: శాంతి చంద్ర హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘డర్టీ ఫెలో’. ఈ మూవీలో దీపిక సింగ్, సిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాలా హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రాన్ని గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జి శాంతి బాబు గ్రాండ్‌గా నిర్మించారు. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించారు.  ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ గా ఈ సినిమాను థియేట్రికల్‌గా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, హీరో సంపూర్ణేష్ బాబు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ..
శాంతి చంద్ర నాకు సోదరుడు లాంటి వ్యక్తి. ఆయన మంచి వాడు. సినిమాకు డర్టీ ఫెలో టైటిల్ ఎందుకు పెట్టారని అడిగాను. ఈ సినిమాకు ఆ టైటిల్ తప్ప మరో ఛాయిస్ లేదని డైరెక్టర్ చెప్పారు. సినిమా మీద ప్యాషన్ ఉన్న శాంతి చంద్ర అన్న హీరోగా ఈ మూవీ చేస్తుండటం సంతోషంగా ఉంది. డర్టీ ఫెలో సినిమా పాటలు, ట్రైలర్ చూశాను. మంచి కథతో వస్తున్న మూవీ ఇది. తప్పక సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
 
దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ..
డర్టీ ఫెలో సినిమాకు పనిచేసిన వాళ్లంతా ఒక ఫ్యామిలీలా కలిసి పనిచేశారు. మన ఇంట్లో వాళ్లను పొగడాల్సిన అవసరం లేదు. నేను చేసే రిక్వెస్ట్ ఒకటే. ఒకప్పుడు మన సినిమాలకు శతదినోత్సవాలు జరుపుకునేవాళ్లం. ఇప్పుడు రెండు రోజులకే సినిమా లైఫ్ ఫినిష్ అవుతూ జత దినోత్సవాలు జరుపుకునే పరిస్థితి వచ్చింది. టీవీ వచ్చాక సినిమా పనైపోయింది అన్నారు. పైరసీ వచ్చాక ఇక సినిమా బతకలేదన్నారు. అయినా ఇండస్ట్రీ తట్టుకుని ముందడుగు వేస్తూనే వస్తోంది. కానీ ఇప్పుడు పైరసీ కాదు ప్రైవసీ జబ్బు వచ్చింది. ఎవరికి వారు ఇంటినే హోమ్ థియేటర్ లా భావిస్తున్నారు. ఇంట్లో పూజగది ఉంటే దేవాలయం కాదు. సినిమాను థియేటర్ లోనే చూడండి. చిన్న సినిమాలను బతికించండి. లేకుంటే ఒకప్పుడు తోలు బొమ్మలాటలు ఆడేవారంట అని చెప్పుకున్నట్లే. థియేటర్ లో సినిమాలు ప్రదర్శించేవారట అని రేపటి తరాలు చెప్పుకునే పరిస్థితి రావద్దన్నారు.


దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ -


శాంతి చంద్ర  ఎక్స్ సర్వీస్ మెన్. దేశానికి తన సేవలు అందించాడు. డర్టీ ఫెలో సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. డైరెక్టర్ మూర్తి సాయి మిగత  మూవీ టీమ్ సినిమాను జాగ్రత్తగా చూసుకుంటూ రూపొందించారు. రష్ రీ చెక్ చేసుకుంటూ బెటర్ మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. నేను ఒక గైడ్ గా ఉన్నానంతే. డర్టీ ఫెలో సినిమాను ఈ నెల 24న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండన్నారు.  


మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ మాట్లాడుతూ -


డైరెక్టర్ మూర్తి సాయి, శాంతి చంద్ర, నేను కలిసి కోవిడ్ టైమ్ లో దహనం అనే మూవీ చేశాము. ఆ సినిమాకు అవార్డ్స్ వచ్చాయి. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత డర్టీ ఫెలో మూవీ గురించి డైరెక్టర్ నాతో డిస్కస్ చేస్తుండేవారు. ఆ టైమ్ లో నేను కంపోజ్ చేసిన ఓ సాంగ్ నచ్చి శాంతి చంద్ర ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా ఒక పాట ఇచ్చిన ఇన్సిపిరేషన్ తో డర్టీ ఫెలో సినిమా స్టార్ట్ అయిందన్నారు. ఆ పాటను సినిమాలో ఎస్పీ చరణ్, మాళవిక పాడారు. సినిమాకు నా వంతుగా న్యాయం చేశాననే భావిస్తున్నాను. శాంతి చంద్ర గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాన్నారు.



హీరోయిన్ దీపిక సింగ్ మాట్లాడుతూ -
డర్టీ ఫెలో సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చిన హీరో శాంతి చంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  


హీరోయిన్ సిమ్రితి బతీజా మాట్లాడుతూ -
మా మూవీ ఈవెంట్ కు వచ్చిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలుగులో నేను నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఈ అవకాశం ఇచ్చిన శాంతి చంద్రకు థ్యాంక్స్ చెప్పుకొచ్చారు.
 
హీరోయిన్ నికిష రంగ్ మాట్లాడుతూ..

తెలుగులో నేను నటిస్తున్న రెండో చిత్రమిది. గ్లామర్ తో పాటు నటనకు మంచి స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ లో ఈ సినిమాలో కనిపించాను. డర్టీ ఫెలో మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది.


హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ -
ఈ సినిమా మేకింగ్ లో గైడ్ చేస్తూ మమ్మల్ని నడిపించిన డైరెక్టర్ వీరశంకర్‌కి థాంక్స్..  నా గురించి చెప్పుకోవాలంటే సినిమానే నా జీవితం. సినిమానే నా ఆలోచన. నా నాలుగో ఏటనే మా నాన్న చనిపోయారు. చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా కెమెరా నన్ను ఫాలో అవుతుందనే ఫీల్ అయ్యేవాడిని. భారత నేవీలో చేరాక అక్కడ మేము చేసే సాహసాల టైమ్ లోనూ కెమెరా ఉందనే అనిపించేది. ఎప్పటికైనా హీరో కావాలనే కలగన్నాను. మంత్ర సినిమాతో ఆ కోరిక తీరింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొంత గ్యాప్ వచ్చింది. బిజినెస్ చేస్తూ ఇక్కడ మూవీస్ చేయలేకపోయాను. ఇక్కడ స్థిరపడాలంటే ఇక్కడే ఉండాలి. కొంతకాలం తర్వాత మూర్తి సాయి, డాక్టర్ సతీష్ , ఇతర టీమ్ కలిశారు. వాళ్లను చూశాక ఇది రైట్ టీమ్ అనిపించింది. అలా డర్టీ ఫెలో సినిమా మొదలుపెట్టాం. మూవీ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. అందుకే ఈ సినిమా కోసం ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదని మొత్తం ప్రొడక్షన్ భారం నేనే తీసుకున్నాను. ఈ నెల 24న విడుదల కాబోతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆషాభావం వ్యక్తం చేశారు. ఆ మూవీలో ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, యాక్షన్, రొమాన్స్ అన్నీ ఉంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. మూవీ బిగినింగ్ నుంచి అలా వెళ్తూ ఉంటుంది. మా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. డర్టీ ఫెలో హిట్ అనేది మా మూవీ టైటిల్ సాంగ్ చేసినప్పుడే నమ్మకం కుదిరింది. ఆ పాట షూటింగ్ చేసేదాక నేను నిద్రపోలేదు. మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇది ధమాకా, బ్లాస్ట్ లాంటి సక్సెస్ అందుకుంటుంది. అన్నారు.


Also read: Summer Tourism Tips: వేసవిలో ఈ 6 పర్యాటక ప్రాంతాల సందర్శన నరకమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook