Independence Day Spl Song: తన ఆహార విధానాలతో  ఆరోగ్యకరమైన డైట్ స్థాపించి ఆహారం మాది ఆరోగ్యం మీది  అనే నినాదంతో పనిచేస్తున్నారు. కొంతమంది డైటీషియన్స్ మరియు కొంతమంది డాక్టర్స్ ను కలుపుకొని కూరగాయలతో కొన్ని వంటకాలు కనిపెట్టి ఎంతోమందికి దీర్ఘకాలిక వ్యాధిల్ని  తగ్గిస్తున్నారు  లక్ష్మణ్ పూడి. అంతేకాదు  తను మాతృ సంస్థ ‘ప్రజా నాట్యమండలి’  పాటు తన స్నేహితుల సహాకారంతో  ఎం శేషగిరి రచించిన పాటను శ్రీనివాస్ నందుల సంగీతం అందించారు. అంతేకాదు లక్ష్మణ్ పూడి గానం చేసినటువంటి  ‘స్వాతంత్రం మా స్వాతంత్ర్యం’ అనే పాటను దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 77 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సారి 78వ స్వాతంత్య్ర దినోత్సవం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశం ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది.  కానీ నిరక్షరాస్యత, పేదరికం లో చాలా కుటుంబాలు ఇంకా ఉన్నాయి. గత కొన్నేళ్లగా  కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారు. ఈ పరిస్థితులు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని లక్ష్మణ్ పూడి  స్వాతంత్ర్యం మీద చేసిన సాంగ్ మహాద్భుతంగా ఉందన్నారు.


ఈ సందర్భంగా ప్రజా నాట్యమండలి గాయకుడు  లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ నేను కారులో వెళుతున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారిని చూస్తున్నారు. ప్రభుత్వాలు వారికీ సహాయం అందిస్తూన్న వారు ఇదే జీవనోపాధి చేసుకున్నారు.అందులో కొంత మంది స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలియదు. దేశంమీద ప్రేమతో ఇలాంటి నిరక్షరాస్యులను పాటతో మేల్కొల్పటానికి ఈ  పాట చేయడం జరిగిందన్నారు.  సాంగ్ లాంచ్ చేసిన మా గురువు  భరద్వాజ్ కి కృతజ్ఞతలు అన్నారు. కార్యక్రమానికి సినిమా డైరెక్టర్ కర్రి బాలాజీ, వంశీ లక్ష్మణ్ పూడి  తదితరులు హాజరయ్యారు.


Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..


Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter