Just A Minit Movie Review: ‘జస్ట్ ఎ మినిట్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..
Just A Minit Movie Review: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో విభిన్న కథా చిత్రాలు వస్తున్నాయి. ఈ రూట్లో ‘ఏడు చేపల కథ’ వంటి డిఫరెంట్ సినిమాతో హీరోగా పరిచయమైన అభిషేక్ పచ్చిపాల కథానాయకుడి తెరకెక్కిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
నటీనటులు: అభిషేక్ పచ్చిపాల,నజియా ఖాన్, జబర్ధస్త్ ఫణి, వినీషా, ధర్మపురి కార్తిక్, సతీష్ సారిపల్లి తదితరులు.
సినిమాటోగ్రఫీ: సమీర్
ఎడిటింగ్: దుర్గా నరసింహా
సంగీతం: షేక్ బాజీ
నిర్మాణం: రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్
నిర్మాత, రచయత: అర్షద్ తన్వీర్, ప్రకాష్ ధర్మపురి
దర్శకత్వం: పూర్ణాస్ యశ్వంత్
ఏడు చేపల కథ ద్వారా నటుడిగా ఇంట్రడ్యూస్ అయిన అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించిన సినిమా ‘జస్ట్ ఏ మినిట్’. నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా నటించారు. రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, కార్తీక్ ధర్మపురి సమర్పించు సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా తన్వీర్ మరియు ప్రకాష్ ధర్మపురి ఈ చిత్రాన్ని నిర్మించారు. యశ్వంత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా జస్ట్ ఎ మినిట్. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే :
చెప్పుకోలేని అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటాడు రవి (అభిషేక్ పచ్చిపాల). ఆ ప్రాబ్లెమ్ నుంచి బయటపడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా చేసే ప్రయత్నంలో తనకు పరిచయమైన పూజ (నజియా ఖాన్) తో తొలిచూపులోనే లవ్ లో పడతాడు. తన సమస్య తన స్నేహితుడైన రాంబాబు (జబర్దస్త్ ఫణి) కి తెలుసు. రాంబాబు హెల్ప్ తో ఆ సమస్యను ఎదుర్కోవడం కోసం చేసే ప్రయత్నం చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంతకీ రవికి ఉన్న సమస్య ఏంటి? చివరికి సమస్య నుంచి బయట పడ్డాడా? లేదా? రవికి పూజ ఒక్కటయ్యారా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ మరియు సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా తన్వీర్ మరియు ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తన్వీర్ గారు నిర్మాత గానే కాకుండా లిరిక్ రైటర్ గా మరియు కథ, డైలాగ్స్ లో కూడా మంచి టాలెంట్ చూపించారు. ఎస్.కె. బాజీ అందించడం మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. యశ్వంత్ మొదటిసారి దర్శకత్వం చేస్తున్న మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడిగా ఈ కథను డీల్ చేసాడు. ప్రస్తుతం సమాజంలో చాలా మంది యువకులు ఫేస్ చేస్తున్న సమస్యను కథను తీసుకొని.. దాన్ని ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తెరకెక్కించాడు. అంతేకాదు సినిమాలో కామెడీని ఏ మోతాదులో ఎక్కడా వాడాలో అక్కడ వాడాడు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు శృతి మించినా.. కథలో భాగంగానే తెరకెక్కించాడు. అక్కడ కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయి. ఓవరాల్ ఈ సినిమా యూత్ ను ఆకట్టుకునే మెసేజ్ తో రూపొందించారు. దర్శకుడిగా అతడి ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లో కనబడింది. దుర్గ నరసింహ ఎడిటింగ్ వర్క్ మరియు సమీర్ సినిమాటోగ్రఫీ పనితీరు మెప్పించాయి. చివరగా ప్రెజెంట్ యూత్ చెప్పుకోలేని సమస్యల్ని ఎలా ఎదుర్కొంటున్నారనేది దర్శకుడు ఈ సినిమాలో చాలా బాగా చూపించారు.
నటీనటుల విషయానికొస్తే..
అభిషేక్ పచ్చిపాల తనకున్న సమస్యని కామెడీగా చూపించడంలో మంచి యాక్టింగ్ తెరపై కనబరిచారు. హీరోగా మంచి భవిష్యత్తు ఉంది. హీరోయిన్ నజియా ఖాన్ నటన గ్లామరస్ గా యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. జబర్దస్త్ ఫణి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కామెడీ మరి ఎమోషన్ ని చాలా బాగా పండించారు. సారిపల్లి సతీష్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. అలాగే ఈ చిత్రంలో పోలీస్ పాత్రలు కామెడీని బాగా పండించారు. మిగిలిన క్యారెక్టర్స్ వారి పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్: ‘జస్ట్ ఏ మినిట్’..యూత్ ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ కామెడీ లవ్ ఎంటర్టైనర్..
రేటింగ్ : 2.75/5
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook