Pani Pre Release Event: రీసెంట్ గా మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన జోజు జార్జ్ హీరోగా నటించిన చిత్రం ‘పని’. ఈ సినిమాను ఈ నెల 13న థియేట్రికల్ గా రిలీజ్ చేయబోతున్నారు.  ఈ సినిమాలో జోజు జార్జ్ సరసన అభినయ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్  ముందుకు రాబోతుంది.  రాజవంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ‘పని’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ.. ‘పని’ మూవీ మలయాళంలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఇదొక సెన్సబుల్ ఫిల్మ్. పని సినిమా తెలుగులోకి నా దోస్త్  రాజ వంశీ తీసుకొస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.  జోజు జార్జ్ మంచి నటుడు. ఆయన ఎన్నో అవార్డ్ లు అందుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. పని సినిమా తెలుగులోనూ  మంచి సక్సెస్ సాధించాలని వీర శంకర్ ఆకాంక్షించారు. రాజ వంశీతో పాటు టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు.


తెలుగు ఫిలింఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. మల్లూవుడ్ సినిమా అంటే నాకు సెపరేట్ గౌరవం ఉందన్నారు. వాళ్లు కంటెంట్ ను ప్రేమిస్తారు. అందుకే మంచి విజయాలు అందుకుంటున్నారు. పని సినిమా కూడా అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న చిత్రమన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రానికి మంచి విజయం అందించాలని కోరారు.  


మలయాళ ప్రొడ్యూసర్ సిజో వడక్కన్ మాట్లాడుతూ - ‘పని’ చిత్రంతో జోజు జార్జ్, అభినయ వంటి మంచి ఆర్టిస్టులతో పనిచేసే అవకాశం కలిగిందన్నారు. పని సినిమా మలయాళం, కన్నడ, తమిళంలో బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులోనూ అలాంటి విజయాన్నే సాధిస్తుందని కోరుకుంటున్నామన్నారు.


నటి అభినయ మాట్లాడుతూ ..‘పని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులక ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు.  ఇదొ అద్భుతమైన చిత్రమన్నారు. జోజు జార్జ్ తో కలిసి యాక్ట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. నటుడిగానే కాదు దర్శకుడిగానూ జోజు జార్జ్ మంచి టాలెంటెడ్ అని చెప్పుకొచ్చారు.  ఈ సినిమా  తెలుగు  ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేసారు.
 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ వంశీ మాట్లాడుతూ.. వర్క్ ఈజ్ గాడ్...మనం చేసే పని మనకు దేవుడు. ‘పని’ సినిమాను అదే స్పూర్తితో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తుండటం ఆనందంగా ఉందన్నారు. ఇది మంచి థ్రిల్లర్ సినిమా. 2 గంటల పాటు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడం ఖాయమన్నారు. ఈ చిత్రంలో జోజు జార్జ్ అద్భుతంగా రూపొందించారు. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలన్నారు. నటుడిగా ఆయన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఈ చిత్రం ఈ నెల 20న ఓటీటీలో రావడం  లేదు. తెలుగులో థియేటర్స్ లో సక్సెస్ పుల్ గా రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఓటీటీలోకి రాబోతుందన్నారు.


హీరో కమ్ దర్శకుడు జోజు జార్జ్ మాట్లాడుతూ -  మా ‘పని’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అతిథులు అందరికీ ధన్యవాదాలు.  వాళ్లు నా గురించి గొప్పగా మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. నా దృష్టిలో మంచి సినిమాకు భాషా హద్దులు ఉండవు. ఏ భాషలో ప్రేక్షకులైనా ఆదరిస్తారు. తెలుగు చిత్రాల్లో నటించి మీ ప్రేక్షక ఆదరణ పొందాను. ‘పని’ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంన్నారు. మా టీమ్ లోని ప్రతి మెంబర్ తన వర్క్ ను అద్భుతంగా చేశారు. అభినయతో కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. పని మూవీ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మీరంతా మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నామన్నారు.


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.