Pagal Vs Kadal Movie Review: ‘పాగల్ వర్సెస్ కాదల్’ మూవీ రివ్యూ..
Pagal Vs Kadal Movie Review: తెలుగులో ప్రేమకథా చిత్రాలకు ఎపుడు డిమాండ్ ఉంటుంది. ఈ కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పాగల్ వర్సెస్ కాదల్’. ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం..
రివ్యూ: పాగల్ వర్సెస్ కాదల్ (Pagal Vs Kadal)
నటీనటులు: విజయ్ శంకర్, విషిక, బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి, ఆద్విక్ బండారు, తదితరులు
ఎడిటింగ్: డీఐ - శ్యామ్ కుమార్.పి
సినిమాటోగ్రఫీ: నవధీర్
సంగీతం: ప్రవీణ్ సంగడాల
బ్యానర్: శివత్రి ఫిలింస్
నిర్మాత: పడ్డాన మన్మథరావు
దర్శకత్వం: రాజేశ్ ముదునూరి
విడుదల తేది: 9-8-2024
ఈ రోజు పలు లో బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ కోవలో వచ్చిన చిత్రం ‘పాగల్ వర్సెస్ కాదల్’. పేరుతోనే ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
పాగల్ వర్సెస్ కాదల్ కథ విషయానికొస్తే.. ఇదో రెండు పరస్పర విరుద్ద జంటల మధ్య జరిగే ప్రేమ కథ. ప్రేమలో పడితే.. ఆ మనిషి పిచ్చోడు అవుతాడనే కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సినిమాకు ‘ పాగల్ వర్సెస్ కాదల్ ’ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఓ వ్యక్తి తాగి రోడ్డుపై న్యూసెన్స్ చేస్తుంటాడు. అతను ఎందుకు గలాభా చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎస్.ఐ (బ్రహ్మాజీ), పోలీస్ కానిస్టేబుల్ రామ్ ప్రసాద్ (షకలక శంకర్) అక్కడకు వస్తాడు. ఈ క్రమంలో అతను తన ఫ్రెండ్ కార్తీక్ (విజయ్ శంకర్) స్టోరీ చెబుతాడు. అతని లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులుంటాయి. అతను ప్రేమించే అమ్మాయి ఓ సైకో అని చెబుతాడు. అయితే.. ఆ అమ్మాయి బ్రదర్ మనోజ్ ను కార్తీక్ చెల్లెలు అమృత ప్రేమిస్తుంది. అతను ఆమె ప్రేమను యాక్సెస్ట్ చేయడు. ఈ క్రమంలో పరస్పర భిన్న ధృవాలైన ఈ జంటలు ఒక్కటయ్యారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగు సహా ఇతర భాషల్లో ఢిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీలు తెరకెక్కుతూనే ఉన్నాయి. ఈ కోవలో వచ్చిన మరో ప్రేమ కథా చిత్రమే ‘పాగల్ వర్సెస్ కాదల్. ప్రేమ పిచ్చిది అనే కాన్సెస్ట్ నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ క్రమంలో దర్శకుడు డిఫరెంట్ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అందులో చాలా వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా కథలో కార్తీక్, ప్రియ, అమృత, మనోజ్ అనే నాలుగు మెయిన్ పాత్రలను తీసుకొని వాటిని వేటికవి డిఫరెంట్ ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. అంతేకాదు వారి క్యారెక్టర్ నుంచి కామెడీ పండించాడు. ఈ సినిమాలో పొరలు పొరలుగా రెండు విచిత్రమైన ప్రేమకథలను చెబుతూనే.. వాటికి ఒకటే డిఫరెంట్ ఎండింగ్ వచ్చేలా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు.
ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు, అబ్బాయిలు అందరు తమను ప్రేమించే వాళ్లు తమను బాగా చూసుకోవాలని కోరుకుంటారు. వేరే వాళ్లను చూస్తే తట్టుకోలేని నైజం. ప్రెజెంట్ జనరేషన్ యూత్ ఎలా ఆలోచిస్తుందో ఈ సినిమాలో చూపెట్టాడు దర్శకుడు. అదే అతిప్రేమ శాడిజంగా ఎలా మారుతుందనే అంశాన్ని చక్కగా సృశించాడు. ప్రేమకు నమ్మకం ఉండాలి కానీ అనుమానం కాదు అనే మంచి మెసేజ్ కూడా పాగల్ వర్సెస్ కాదల్ మూవీలో ఉంది. మొత్తంగా తాను చెప్పదలుచుకున్న అంశాన్ని షుగర్ కోటెడ్ తో చక్కగా తెరపై ప్రెజెంట్ చేసాడు దర్శకుడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆర్ఆర్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేది. నిర్మాత మన్మథ రావు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉన్నంతలో బాగానే ఈ సినిమాకు ఖర్చు పెట్టారు. దర్శకుడు ముదునూరి తొలి సినిమాతోనే డిఫరెంట్ లవ్ స్టోరీతో రావడం ఆహ్వానించదగ్గ పరిణామం.
నటీనటల విషయానికొస్తే..
ఈ సినిమాలో అంతా కొత్తవాళ్లే నటించిన మంచి అనుభవం ఉన్న నటుల్లా తమ పాత్రలకు శక్తి మేరకు న్యాయం చేసారు. అమాయకమైన అబ్బాయి పాత్రలో ప్రియురాలు ఎన్ని బాధలు పెట్టినా.. భరించే పాత్రలో ఆకట్టుకునేలా నటించాడు విజయ్ శంకర్. ఇతనికి నటుడిగా మంచి భవిష్యత్తు ఉంది. ఇక ప్రియ పాత్రలో నటించిన విషికా నిజంగానే సైకో అనే రీతిలో తన పాత్రలో ఒదిగిపోయింది. శాడిస్ట్ సైక్రియాటిస్ట్ మనోజ్ పాత్రలో ప్రశాంత్ ఒదిగిపోయాడు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
ఫ్లస్ పాయింట్స్
విజయ్ శంకర్ యాక్టింగ్
ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్
డైలాగ్స్, డైరెక్షన్
మైనస్ పాయింట్స్
కొన్ని లాజిక్ లేని సీన్స్
సెకండాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter