రివ్యూ: సంఘర్షణ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటీనటులు:శివ రామచంద్రపు,చైతన్య పసుపులేటి, రషీద భాను, ఎక్స్ప్రెస్ హరి, స్వాతిశ్రీ చెల్లబోయిన, సుధాకర్ తదితరులు


ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి


సినిమాటోగ్రఫీ:  కె.వి.ప్రసాద్, సుధాకర్ బార్ట్లే


సంగీతం: ఆదిత్య శ్రీరామ్


నిర్మాత: వల్లూరి శ్రీనివాస్ రావ్


దర్శకత్వం: చిన్నా వెంకటేష్


మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘సంఘర్షణ’. చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వల్లూరి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 9న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్  అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూ లో చూద్దాం.


కథ విషయానికొస్తే:
ఉల్లాసంగా ఉత్సాహాంగా హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేసే చైతన్య (చైతన్య పసుపులేటి) అలాగే అమ్మాయి సంయుక్త (రసీదా భాను) వీరి జీవితంలో లో అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. ఆ  తర్వాత వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి. ఈ క్రమంలో నగరంలో మరోవైపు హత్యలు  జరుగుతూ ఉంటాయి. ఈ మర్డర్స్ కు చైతన్య కు సంబంధం ఏమిటి ? పోలీస్ ఆఫీసర్ దీపక్ (శివ) ఈ మర్డర్స్  పై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. కరణ్ కు మరియు తన గ్యాంగ్ కు ఈ మర్డర్స్ కు సంబంధం ఏమిటనేది సినిమా కథ.  


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


ప్రెజెంట్ మన సోసైటీలో జరగుతున్న నేర సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు చిన్న వెంకటేష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాదు సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు మంచి టెంపోను క్రియేట్ చేసాడు. కొత్త నటీనటులతో మంచి నటన రాబట్టుకొన్నాడు. గత కొన్నేళ్లుగా మన పేపర్స్, టీవీల్లో వచ్చే క్రైమ్ అంశాలను తీసుకొని వాటికి ఫ్యామిలీ అంశాలను జోడించి ప్రేక్షకులను మెప్పించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అంతేకాదు  సినిమాను ఎక్కడ అసభ్యకరంగా కాకుండా  ఫ్యామిలీ మొత్తం చూసేలా తెరకెక్కిండం విశేషం. మొత్తంగా మన మధ్య జరుగుతున్న అంశాలనే కథా వస్తువగా తీసుకొని దాన్ని అందరికి అర్థమయ్యేలా తెరకెక్కించడం మాములు విషయం కాదు. సినిమా చూస్తున్నంత సేపు ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడా అనిపిస్తుంది. దర్శకుడిగా చిన్నా వెంకటేష్ కు మంచి భవిష్యత్తు ఉంది. కె.వి.ప్రసాద్, సుధాకర్ బాట్లే సినిమాటోగ్రఫీ నేచురల్ గా ఉంది. వర్క్ సంగీత దర్శకుడు ఆదిత్య శ్రీరామ్ సంగీతం బాగుంది. సన్నివేశాలకు తగ్గట్టు ఆర్ఆర్ ఇరగదీసాడు.  నిర్మాత వల్లూరి శ్రీనివాస్ రావ్ ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గ్రాండియర్ గా నిర్మించారు.


నటీనటుల విషయానికొస్తే..
కొత్త నటీనటులైన తమదైన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. చైతన్య, రసీదా నటన బాగుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.


రేటింగ్: 2.75/5


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter