SPEED220: ఆసక్తి రేకిస్తోన్న ‘SPEED220’ ట్రైలర్.. తమ్మారెడ్డి భరద్వాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
SPEED220: అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం ‘స్పీడ్’. గణేష్, హేమంత్, ప్రీతి సుందర్, జాహ్నవి, నటించిన ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
SPEED220:గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి యాక్ట్ చేసిన చిత్రం SPEED 220. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ రిలీజ్ చేశారు.విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం "SPEED220". ఈ సందర్భంగా ప్రముఖ దర్శక నిర్మాత తమారెడ్డి భరద్వాజ ట్రైలర్ రిలీజ్ తర్వాత మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమా మాదిరి ఒక డిఫరెంట్ స్టోరీ. విభిన్నమైన క్యారెక్టర్స్ తో చక్కటి దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమా ఉందని మెచ్చుకున్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మంచి స్టోరీతో మా దర్శకుడు హర్ష మా దగ్గరికి రావడం జరిగింది. అంతేకాదు దాన్ని అంతే అత్యుద్భుతంగా తెరకెక్కించారు. కథ వినిన వెంటనే మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలి అని డిసైడ్ అయ్యాము.
ఇదొక మంచి ప్రేమ కథ. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో లవ్ వల్ల కలిగే ఇబ్బందులు.. ప్రేమికులు మధ్య ఉండే సంఘర్షణ కళ్లకి కనిపించే విధంగా దర్శకుడు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
చిత్ర దర్శకుడు హర్ష బీజగం మాట్లాడుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆర్ఎక్స్ 100 వలే ఇది ‘రా’ లవ్ స్టోరీ. ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ మోపురి అందించారు. కెమెరామెన్ గా క్రాంతి కుమార్ వ్యవహరించారు. మరోవైపు ఎడిటర్ గా రామకృష్ణ వ్యవహరించారు. టెక్నిషియన్స్ అందరూ వాళ్ల శాఖలలో అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారు ఆగస్టు 23వ తేదీన దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ SPEED 220 చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నామన్నారు.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter