నటీనటులు: శ్రీ మురళి,  రుక్మిణీ వసంత్, గరుడ రామ్, ప్రకాష్ రాజ్, అచ్యుత్ తదితరులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎడిటర్: ప్రణవ్ శ్రీ ప్రసాద్


సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టి


సంగీతం: అజనీస్ లోకనాథ్


నిర్మాత : హోంబళే ఫిలిమ్స్


దర్శకత్వం: డాక్టర్ సూరి


దీపావళి కానుకగా తెలుగులో స్ట్రెయిట్ చిత్రాలతో పాటు కన్నడ, తమిళ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ పై దండయాత్ర చేశాయి. ఈ కోవలో ప్రశాంత నీల్ కథ అందించగా శ్రీమురళి హీరోగా నటించిన చిత్రం ‘బఘీరా’. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ విషయానికొస్తే.


స్టోరీ విషయానికొస్తే.. వేదాంత్ ప్రభాకర్ (శ్రీ మురళి) చిన్నప్పటి నుంచి వాళ్ల  సూపర్ హీరో కావాలనుకుంటాడు. కానీ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. పోలీస్ గా అవినీతి పరుల అంతం చూస్తుంటాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న అతని ఉద్యోగంలో అనుకొని కుదుపు వస్తోంది. నిజాయితీ గల ఆఫీసర్ ఎందుకు అవినీతి పరుడుగా మారాడు. ఆ తర్వాత సూపర్ హీరో ‘బఘీరా’గా ఎందుకు మారాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అవినీతి పరులను ఎలా అంతం చేసాడనేదే ఈ సినిమా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాంటి సినిమాలకు ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టారు హోంబళే ఫిల్మ్స్. దర్శకుడు సూరి కూడా అదే రేంజ్ లో మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందించాడే చెప్పాలి. ఇలాంటి కథలు తెలుగు సహా ఇతర భాషల్లో వచ్చినా.. దాన్ని సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అంతేకాదు ఎలివేషన్ సీన్స్ అన్ని కేజీఎఫ్ లో ప్రశాంత్ నీల్ టేకింగ్ గుర్తుకు వస్తోంది. తెలుగు డబ్బింగ్ విషయంలో మంచి శ్రద్ధ తీసుకున్నారు.


మనకు కొత్త కథలు లేకపోయినా.. మనకు తెలిసిన స్టోరీలేనే కొత్తగా చెబితే ఆదరిస్తారనే దానికి ‘బఘిరా’ ఉదాహరణ. తెలుగు లో ఈ సినిమాకు పోటీ పలు సినిమాలు వచ్చాయి. మాస్ సినిమా కాబట్టి పోటీలో నెగ్గుకు రావచ్చు. కన్నడలో మాత్రం ఈ సినిమా ఏ రేంజ్ హిట్ కు చేరుకుంటుందనేది చూడాలి. ఇలాంటి సినిమాలకు ఆర్ట్ వర్క్ ముఖ్యం. కథ.. సాదాసీదా అయినా.. దాన్ని టెక్నికల్ పరంగా స్క్రీన్ ప్లే పరంగా మలచడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. హీరో ప్లస్ పాయింట్స్ ను నమ్ముకున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథ. యశ్ తర్వాత మరో మాస్ యాక్షన్ హీరోగా శ్రీ మురిళి అని చెప్పాలి.   ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ సీన్స్ ను నమ్ముకున్నారు. మెజారిటీ మాస్ ప్రేక్షకులకు ఈ తరహా సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పాలి. సినిమాకు అజనీస్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫోటో గ్రఫీతో సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాడు.


నటీనటులు విషయానికొస్తే..


కన్నడలో మరో మాస్ యాక్షన్ హీరో శ్రీ మురళి. ప్యాన్ ఇండియా హీరోగా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్ లో అదరగొట్టేసాడు. తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా అతని యాక్టింగ్ ఉంది. ఎమోషన్స్ సీన్స్ ఇంకాస్త బెటర్ గా పర్ఫామ్ చేసుంటే బాగుండేది.
హీరోయిన్ గా నటించిన  రుక్మిణీ వసంత్ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. మంచి నటన కనబరిచింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.


పంచ లైన్.. ‘బఘిరా’ దీపావళి మాస్ పటాకా..


రేటింగ్: 3/5


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter