Indian Idol Season 3:  తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజయవంతంగా కొనసాగుతోంది. వారం వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్ ఈ వారం చోటు చేసుకుంది. ఈ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తూన్న తమన్ తల్లిగారు ఈ వారం స్పెషల్ గెస్ట్ గా ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ లో సందడి చేశారు. అంతేకాదు కంటెస్టెంట్స్ ను ఆశీర్వదించారు.
ఈ ప్రోగ్రామ్ కు తమన్ తల్లి గారు హాజరైన నేపథ్యంలో తమన్ అలియాస్ ఘంటసాల సాయి శ్రీనివాస్ తన చిన్ననాటి విషయాలను ఈ షో లో పంచుకున్నారు. తమన్ చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా మైదానంలోనే ఎక్కువగా వుండేవాడని చెప్పుకొచ్చారు.ఈ విషయంలో  తనకి అస్సలు భయం  ఉండేది కాదన్నారు. అంతేకాదు  స్కూళ్లలో  తమన్ గొడవలు పడిన విషయాన్ని ప్రస్తావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు చిన్నప్పడు తోటి  పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసేవాడని కంప్లయింట్ లు తనకు ఎక్కువగా వచ్చేవన్నారు. అంతేకాదు చిన్నప్పుడు తమన్ చేసిన అల్లరి పనుల  జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఐతే తమన్ చిన్నప్పటి నుంచి హార్డ్ వర్కర్ చేసేవాడని చెప్పుకొచ్చారు. అంతేకాదు మ్యూజిక్ నేర్చుకునే విషయంలో ఎన్నో కష్టానష్టాలను ఓర్చుకొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు ఏదైనా పని ఉంటే..ఆ వర్క్ పూర్తయ్యే వరకు  తిండి కూడా పట్టించుకునే వాడు కాదని చెప్పుకొచ్చారు. తమన్ కు  సంగీతం క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలియదన్నారు. ఈ సందర్భంగా తమనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఈ వేదిక నుంచి ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.  తమన్ విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి గాను జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే కదా.


ఈ ఎమోషనల్, హార్ట్ టచ్చింగ్ ఎపిసోడ్ కోసం ఆహా లో శుక్రవారం,శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ని మిస్ అవ్వకండ చూడండి.


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.