Upendra: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న సెన్సెషనల్ స్టార్ ఉపేంద్ర నటించిన కల్ట్ ఫిల్మ్ ఏ(A)..
Upendra: గత కొన్నేళ్లుగా తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో ఎన్నో చిత్రాలు మళ్లీ థియేటర్స్ లో సందడి చేశాయి. తాజాగా ఉపేంద్ర నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘A’ మూవీ మరోసారి రీ రిలీజ్ కాబోతుంది.
Upendra: ఇండస్ట్రీ ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. ఇక 90వ దశకంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తన సినిమాలతో సంచలనం రేపిన దర్శక, నటుడు ఉపేంద్ర. ఈయన నటించిన ‘A’ మూవీ ఓ కల్ట్ క్లాసిక్. ఇపుడీ సినిమాను 4కే రీరిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం 4కే టెక్నాలజీలో రీ రిలీజ్ చేయడం ఓ ట్రెండ్. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్. 1998లో అంటే సుమారు 26 యేళ్ల క్రితం విడుదలైన ఏ సినిమా ఓ కల్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఆ రోజుల్లో 100 రోజులు ప్రదర్శించడమే కాదు దాదాపు 3, 4 వారాలు టికెట్లు సైతం దొరకలేదంటే ఆ సినిమా చేసిన మ్యాజిక్ ను అర్థం చేసుకొవచ్చు.
ఈ కల్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అంతేకాదు ఆనాటి వింటేజ్ రోజులను తెరపై అవిష్కరింపజేస్తున్నారు ప్రొడ్యూసర్ లింగం యాదవ్. చందు ఎంటర్ టైన్మెంట్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా సినిమా అంటే ప్రేమతో రీ రిలీజ్ లు చేస్తున్నారు. అందులో భాగంగా హీరో ప్రభాస్ నటించిన ఛత్రపతి, యోగి చిత్రాలను 4కే లో మళ్లీ విడుదల చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘A’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే కన్నడలో రీ రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన స్పందనను రాబట్టింది. ఇక జూన్ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేస్తున్నారు.
కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఏ(A) బుద్దిమంతులకు మాత్రమే అనేది శీర్షిక. ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన చాందినీ నటించారు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం కన్నడలో 1998లోనే రూ. 20 కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ రికార్ సెట్ చేసింది. అంతటి కల్ట్ ఫిల్మ్ జూన్ 21 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని సినీ ప్రియులతో పాటు ఉపేంద్ర ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఉపేంద్ర తెరపై చేసిన చిలిపి చేస్టలను తెరపై చూడాలని ఉవ్విల్లూరుతున్నారు. మరి రీ రిలీజ్ లో ఏ మేరకు మాయ చేస్తుందో చూడాలి.
Also Read: KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter