ఎంత పెద్ద మనసో వాళ్లది.. శ్రీవారికి కొండత కానుక సమర్పించి వెళ్లారు !!
ఇద్దరు గుర్తుతెలియని ప్రవాస భారతీయలు తిరుమల శ్రీవారికి భారీ మొత్తంలో కానుక సమర్పించి వెళ్లారు
తిరుమల: చిన్నపాటి సేవ కార్యక్రమం చేసినా ఘనంగా చెప్పుకునే ఈ రోజుల్లో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీవారికి ఏకంగా రూ.14 కోట్లు కానుకగా సమర్పించి వెళ్లారు. వారు ఏమాత్రం తమ పేర్ల బయట చెప్పడానికి ఇష్టడలేదు. చేసిన పుణ్యకార్యం చెప్పుకుంటే తరిగిపోతుందంటారు పెద్దలు.. అందునేమో వాళ్లు అలా సమర్పించి ఇలా సైలెంట్ గా వెళ్లిపోయారు. అయితే టీటీడీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించడంతో విషయం బయటికి వచ్చింది.
ఏకంగా రూ.14 కోట్లు సమర్పరణ
ప్రముఖ మీడియా కథనం ప్రకారం శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వరునికి ఇద్దరు ఎన్ఆర్‌ఐలు సందర్శించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రూ.14 కోట్ల విలువైన ఓవర్ డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఆలయ ప్రత్యేకాధికారికి అందజేశారు.
గతంలో కూడా ఇదే తరహా..
ఇదిలా ఉంటే అజ్ఞాత వాసులు వెళ్తు వెళ్తూ ఈ కానుక మొత్తాన్ని టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని వారు కోరారు.మరో విషయం ఏంటంటే వీరిద్దరూ గతంలో కూడా భారీ మొత్తంలో కానుకలు సమర్పించడం వెళ్లారట. గతేడాది జులైలోనూ రూ.13.5 కోట్లను స్వామివారికి కానుకగా సమర్పించి వెళ్లినట్లు..వీరు ఈ సారి దాని కంటే ఎక్కవ మొత్తంలో శ్రీవారికి కానుకగా సమర్పించి వెళ్లారట. ఈ విషయాన్ని ఆలయ అధికారులు మీడియాకు వెల్లడించారు.