భారతీయ సంతతి వైద్యురాలికి భారీ గ్రాంట్
అమెరికాలో లెథల్ హెడ్ మరియు గొంతు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన అత్యున్నత పరిశోధనలు చేస్తున్న ఇండో అమెరికన్ వైద్యురాలు నిషా డి సిల్వాకి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియో ఫేషియల్ రీసెర్చ్ అనే సంస్థ 8.1 మిలియన్ డాలర్ల గ్రాంటును మంజూరు చేసింది. ప్రస్తుతం నిషా, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో క్లినికల్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఈమెకు సంస్థ పరిశోధనల నిమిత్తం 8 సంవత్సరాలు గ్రాంటు మంజూరు చేయడానికి ముందుకొచ్చింది. వైద్యరంగంలో అత్యద్భుతమైన రీతిలో పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు, వైద్యునిపుణులకు ప్రతీ సంవత్సరం అందించే ఈ గ్రాంటు ఈ
సంవత్సరం ఒక భారతీయ సంతతి వైద్యురాలికి కూడా దక్కడం విశేషమని పలువురు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు.