UK Southwark Mayor Sunil Chopra: యూకెలోని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త సునీల్ చోప్రా లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన మేయర్‌గా ఎన్నికవడం ఇది రెండోసారి. గతంలో 2014-2015లో లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్‌కు మేయర్‌గా, అంతకుముందు మూడుసార్లు డిప్యూటీ మేయర్‌గా సునీల్ చోప్రా బాధ్యతలు నిర్వర్తించారు.  లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్ కౌన్సిల్‌లో భారత సంతతి ప్రజల జనాభా కేవలం 2 శాతమే అయినప్పటికీ సునీల్ చోప్రా రెండోసారి మేయర్‌గా ఎన్నికవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెంట్రల్ లండన్‌లోని సౌత్‌వార్క్ కేథడ్రల్, మాంటేగ్ క్లోజ్‌లో శనివారం (మే 21) సునీల్‌ చోప్రా మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సునీల్‌ చోప్రా నాయకత్వంలోని యూకె లేబర్‌ పార్టీ లిబరల్ డెమోక్రాట్‌లపై విజయం సాధించడంతో ఆయన మేయర్‌గా ఎన్నికయ్యారు.  


సునీల్‌ చోప్రా గత నాలుగు దశాబ్దాలుగా యూకెలో నివసిస్తున్నారు. యూకెలో ఆయన చిన్నపిల్లల గార్మెంట్స్, బేబీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తున్నారు. 2010 నుంచి బ్రిటన్ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. సౌత్‌వార్క్‌లో ఇండియన్ కమ్యూనిటీ కోసం హిందూ సెంటర్‌ను కూడా నిర్వహిస్తున్నారు.


1970వ దశకంలో ఢిల్లీలో చదువుకునే రోజుల్లోనే సునీల్‌ చోప్రా రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1972లో ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్‌కు ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ ఢిల్లీ అధ్యక్షుడిగా కూడా అప్పట్లో చోప్రా పనిచేశారు. యూకె రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న సునీల్ చోప్రా ప్రస్థానంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


Also Read: Omicron: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్... తమిళనాడులో బీఏ.4, తెలంగాణలో బీఏ.5 వేరియంట్ గుర్తింపు..   


Also Read: Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సింహంతోనే పరాచకాలా.. చేతి వేలిని పిప్పి చేసిన మృగరాజు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేం