Omicron: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్... తమిళనాడులో బీఏ.4, తెలంగాణలో బీఏ.5 వేరియంట్ గుర్తింపు..

Omicron BA4 BA5 Variants in India:  దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్ కలకలం రేపుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్స్‌ను దేశంలో గుర్తించినట్లు జీనోమిక్ కన్సార్షియమ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 10:50 PM IST
  • దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్ కలకలం
  • తమిళనాడులో బీఏ.4, తెలంగాణలో బీఏ.5 వేరియంట్ గుర్తింపు
  • నిర్ధారించిన ఇండియన్ జీనోమిక్ కన్సార్షియమ్
Omicron: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్... తమిళనాడులో బీఏ.4, తెలంగాణలో బీఏ.5 వేరియంట్ గుర్తింపు..

Omicron BA4 BA5 Variants in India: భారత్‌లో తొలిసారి ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5ని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జీనోమిక్ కన్సార్షియమ్ (INSACOG) వెల్లడించింది. తమిళనాడుకు చెందిన ఓ 19 ఏళ్ల యువతిలో బీఏ.4 వేరియంట్‌ను, తెలంగాణకు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడిలో బీఏ.5 వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపింది. ఈ ఇద్దరిలోనూ స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని... ఇద్దరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారేనని పేర్కొంది. ఈ ఇద్దరికీ విదేశాలకు వెళ్లిన ట్రావెల్ హిస్టరీ లేదని తెలిపింది.

తమిళనాడులో బీఏ.4 కేసును గుర్తించడం కన్నా ముందే సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఓ వ్యక్తిలో బీఏ.4 వేరియంట్‌ను గుర్తించినట్లు ఇండియన్ జీనోమిక్ కన్సార్షియమ్ వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యగా బీఏ.4, బీఏ.5 పేషెంట్స్‌ కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు తెలిపింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అయిన బీఏ.4, బీఏ.5 ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాప్తిలో ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మొదట సౌతాఫ్రికాలో ఈ వేరియంట్స్ బయటపడ్డాయి. ఈ వేరియంట్స్ కారణంగా వ్యాధి తీవ్రత పెరగడం కానీ ఆసుపత్రిపాలవడం కానీ జరగట్లేదని జీనోమిక్ కన్సార్షియం వెల్లడించింది.

కరోనా కేసుల విషయానికొస్తే... దేశవ్యాప్తంగా ఆదివారం (మే 22) మరో 2226 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 65 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,36,371కి చేరింది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,24,413కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,955 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 

Also Read: Flipkart Smart TV offers: ఫ్లిప్‌కార్ట్‌‌‌లో ఆఫర్ల పండగ... రూ.20 వేలు విలువ చేసే ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.849కే...   

Also Read: ఒకే రోజు శని జయంతి, సోమవతి అమావాస్య, వట్ సావిత్రి వ్రతం... 30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక... ఆరోజు తప్పక చేయాల్సిన పనులివే...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News