Telugu Student Died in USA: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి - అరుణ దంపతుల రెండో కుమారుడు క్రాంతికిరణ్‌ రెడ్డి. హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తిచేసిన క్రాంతి.. కొన్నాళ్లు ఇక్కడే ఓ సంస్థలో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఉన్నత చదువులు చదివే ఉద్దేశ్యంతో గత యేడాది జూలైలో అమెరికా వెళ్లాడు. యూఎస్‌లోని మిజోరీ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ కోర్సు చదువుతున్నాడు. అయితే, ఈనెల 7వ తేదీన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో క్రాంతికిరణ్‌ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. క్రాంతి ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఆ ప్రమాదంలో క్రాంతి కిరణ్‌ మరణించాడు. ఆ సమయంలో మరో నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. క్రాంతి ముగ్గురు స్నేహితులు కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రాంతి కిరణ్‌ రెడ్డి మరణవార్త తెలియగానే అతడి సొంతూరైన అన్నారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి, కుటుంబసభ్యుల రోదనలు వర్ణనాతీతంగా మారాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి క్రాంతికిరణ్‌ తండ్రికి మంగళవారం ఉదయం సమాచారం వచ్చింది. హైదరాబాద్‌లో ఉండగా టీసీఎస్‌లో ఉద్యోగం చేసేవాడని, తమ కళ్లముందే ఉండేవాడని, ఇంకా చదువుతానన్న ఆశయంతో అమెరికా వెళ్లాడని క్రాంతి తండ్రి శ్రీనివాస్‌ రెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. 


అమెరికా వెళ్లిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాలేదని, త్వరలోనే వస్తానని ఇటీవలే సమాచారం ఇచ్చాడని, అంతలోనే విగతజీవిగా మారాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెద్ద కొడుకు చంద్రకాంత్‌ రెడ్డి కూడా అమెరికాలోనే ఉంటున్నాడని, కుమారుడి మృతదేహం వీలైనంత తొందరగా స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌ రెడ్డి వేడుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.


Also read : Cyclone Asani Live Updates: అసని తుపాన్‌తో పలు రైళ్ల రద్దు, ఇంకొన్ని దారి మళ్లింపు


Also read : Inter Exam Postponed: అసనీ తుపాను ప్రభావం, ఇంటర్ మొదటి సంవత్సరం మేథ్స్ పరీక్ష వాయిదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook