NRI Student Devansh Died: అమెరికాలో ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా గన్ కల్చర్ కి మాత్రం బ్రేకులు పడడం లేదు. తాజాగా శనివారం రాత్రి అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఒక విద్యార్థికి గాయాలయ్యాయి.  అమెరికాలో జరిగిన కాల్పులలో సంగారెడ్డి జిల్లా విద్యార్థికి గాయాలు కావడంతో అతను ప్రస్తుతం చికాగోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోపక్క చికాగో కాల్పులలో తెలుగు విద్యార్థి మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కాల్పులలో విజయవాడకు చెందిన దేవాన్ష్ అనే విద్యార్థి మృతి చెందాడు. తెలంగాణకు చెందిన విద్యార్థి సాయి చరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సాయిచరణ్ దేవాన్ష్ కలిసి వాల్మార్ట్ కి వెళుతుండగా దీనిపై కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. వారి దగ్గర వస్తువులన్నీ లాక్కున్న దుండగులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక మరోపక్క చికాగోలో శనివారం అర్ధరాత్రి చైనా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో కొంతమంది మీద కాల్పులు జరిగాయి.


ఈ కాల్పులలో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంకి చెందిన సాయి చరణ్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. సాయిచరణ్ ప్రస్తుతం మాస్టర్స్ కంప్లీట్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఇక సాయిచరణ్ మీద కాల్పులు జరిగిన విషయాన్ని సాయిచరణ్ స్నేహితులు అతని తల్లిదండ్రులకు వెల్లడించారు. అమెరికాలో భారీ గన్ ఫైరింగ్ నేపద్యంలో సుమారు 10 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చైనా నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున లాస్ ఏంజెల్స్ లోని మోటరింగ్ పార్క్ లో జరుగుతున్న నేపథ్యంలో ఒక దుండగుడు వచ్చి భారీ మెషిన్ గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.


ఈ నేపద్యంలో దుండగులు జరిపిన కాల్పులలో సుమారు 10 మంది మరణించినట్లు చెబుతున్నారు. మరో 10 మంది గాయపడ్డారు, ఆ గాయపడిన వారిలో సాయిచరణ్ కూడా ఒకరు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే దుండగుడు పారిపోయాడని చెబుతున్నారు. ఒక వ్యక్తి మిషన్ గన్ తో వచ్చి కాల్పులకు పాల్పడినట్లుగా అక్కడ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. ఇక అతని వద్ద భారీగా మందుగుండు సామాగ్రి కూడా ఉండడంతో ఎవరూ అతన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించలేదు. అయితే పోలీసులు వస్తారనే ముందే సమాచారం ఉండడంతో అతను అక్కడ నుంచి జారుకున్నాడు.  పార్క్ సమీపంలో ఉన్న డాన్సింగ్ క్లబ్ లక్ష్యంగానే నిందితుడు ఈ కాల్పులు జరిపి ఉండవచ్చని భావిస్తున్నారు.


Also Read: US Female Sikh Judge: అమెరికాలో తొలి సిక్కు మహిళా జడ్జిగా మోనికా సింగ్


Also Read: Adilabad Man Death: పండుగ వేళ విషాదం.. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook