Schneider Electric Unit In TS : ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ సంస్థ సెనెజర్ ఎలక్ట్రిక్‌ సంస్థ తెలంగాణలో మరో యూనిట్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆ సంస్థకు సంబంధించిన యూనిట్‌ పురోగతిలో ఉండగా.. అదే ఊపుతో అదనంగా మరో కొత్త యూనిట్‌ ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన సెనెజర్ ఎలక్ట్రిక్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెట్‌ లుక్‌రిమోంట్‌ ఈ ప్రకటన చేశారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సు వేదిగా సెనెజర్ ఎలక్ట్రిక్‌ ఈ ఉత్సాహపూరిత ప్రకటన చేసింది. అయితే, ఇప్పటికే తెలంగాణలో ఉన్న ఆ సంస్థకు చెందిన యూనిట్‌ అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన కంపెనీగా అడ్వాన్స్డ్‌ లైట్‌హౌస్‌ అవార్డుని సొంతం చేసుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడం వల్లే ఈ అవార్డు దక్కిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లుక్‌ రిమోంట్‌ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే జోష్‌లో మరో యూనిట్‌ను అదనంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. తెలంగాణలో పరిశ్రమల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న స్నేహపూరిత వాతావరణంపై ఆయన ప్రశంసలు కురిపించారు. తమ కంపెనీకి సంబంధించి తెలంగాణలో కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న ఈ పరిస్థితుల కారణంగానే తాజా విస్తరణ ప్రణాళికలు ప్రకటిస్తున్నట్లు రిమోంట్‌ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే అదనపు యూనిట్‌ నుంచి ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ఆటోమేషన్‌ ఉత్పత్తులు తయారు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.



ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను పెట్టుబడులకు రాజధానిగా రూపొందించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే సెనెజర్ ఎలక్ట్రిక్‌ సంస్థ.. అదనపు తయారీ యూనిట్‌ ప్రారంభించేందుకు ఆసక్తిని వ్యక్తపరిచిందని చెప్పారు. ఈ యూనిట్‌ ఏర్పాటు ద్వారా అదనంగా వెయ్యి మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సెనెజర్ ఎలక్ట్రిక్‌ సంస్థకు మంత్రి కేటీఆర్‌ (Minister KTR) కృతజ్ఞతలు తెలిపారు.


Also read : KTR, Aditya Thackeray meeting: దావోస్‌లో కేటీఆర్‌తో ఆదిత్య థాకరే భేటీ


Also read : Hyderabad As Life Sciences Capital: లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్.. దావోస్‌‌లో మంత్రి కేటీఆర్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.