KTR, Aditya Thackeray meeting: దావోస్‌లో కేటీఆర్‌తో ఆదిత్య థాకరే భేటీ

KTR, Aditya Thackeray meeting: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతున్న దావోస్‌లో తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, మహారాష్ట్ర పర్యాటక మంత్రి ఆదిత్య థాకరే భేటీ అయ్యారు. దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్‌లో ఆదిత్యథాకరే కాసేపు కేటీఆర్‌తో ముచ్చటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 12:51 AM IST
  • దావోస్‌లో మంత్రి కేటీఆర్‌, మహారాష్ట్ర పర్యాటక మంత్రి ఆదిత్య థాకరే భేటీ
  • తెలంగాణలో ఫార్మా, ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలపై చర్చ
  • త్వరలోనే హైదరాబాద్‌ వస్తానని కేటీఆర్‌కు హామీ
KTR, Aditya Thackeray meeting: దావోస్‌లో కేటీఆర్‌తో ఆదిత్య థాకరే భేటీ

KTR, Aditya Thackeray meeting: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతున్న దావోస్‌లో తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, మహారాష్ట్ర పర్యాటక మంత్రి ఆదిత్య థాకరే భేటీ అయ్యారు. దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్‌లో ఆదిత్యథాకరే కాసేపు కేటీఆర్‌తో ముచ్చటించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై ఇరువురు మంత్రులు చర్చించారు. 

తెలంగాణలో ఫార్మా, ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలపై జరుగుతున్న పురోగతి, పెట్టుబడుల కోసం సాగిస్తున్న ప్రయత్నాల గురించి ఆదిత్యథాకరే ఆసక్తిగా తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం, గ్రీన్‌ బడ్జెట్‌ కోసం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పది శాతం నిధులను కేటాయించడం వంటి సంస్కరణల గురించి కేటీఆర్‌.. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేకు వివరించారు.

వివిధ అంశాల్లో  తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి అధ్యయనం చేసేందుకు ఆదిత్య థాకరే ఆసక్తిని వ్యక్తపరిచారు. త్వరలోనే హైదరాబాద్‌ వస్తానని కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. అలాగే, మహారాష్ట్రలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కేటీఆర్‌కు (Minister KTR in Davos) వివరించారు. పరస్పరం కలిసి పనిచేస్తే రాష్ట్రాలు బలోపేతమవుతాయని, ఫలితంగా దేశం బలవంతమవుతుందని ఇరువురూ అభిప్రాయపడ్డారు.

Also read : British Airways: హైదరాబాద్-లండన్ విమానాల్లో తెలుగు మాట్లాడే సిబ్బంది నియామకం

Also read : KTR Tour In London: తెలంగాణ తల్లి రుణం తీర్చుకోండి, ఎన్నారైలకు కేటీఆర్ పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G18

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x