తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం
హైదరాబాదుకు చెందిన ప్రముఖ దంత వైద్య నిపుణుడికి అరుదైన గౌరవం లభించింది.
హైదరాబాదుకు చెందిన ప్రముఖ దంత వైద్యుడికి అరుదైన గౌరవం లభించింది. ఇటలీలోని ‘యూనివర్సిటీ డెగ్లి స్టడీ ది జెనోవా’ తొలిసారిగా తమ సంస్థకు డైరెక్టర్‌గా దంత వైద్య నిపుణులు డా.వికాస్‌గౌడ్‌ను నియమించింది. భారతీయ వైద్యుడిని డైరెక్టర్‌గా నియమించడం ఇదే ప్రథమం.
దంతవైద్య శాస్త్రంలోని ఇంప్లాంటాలజీలో అనుభవం ఉన్న వికాస్‌ను టీచింగ్‌కు గానూ డైరెక్టర్ హోదా కల్పించినట్టు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. దంతవైద్యంలో ఇంప్లాంటాలజీలో కోర్సుల నిర్వహణ, విద్యాబోధనలో చురుకైన పాత్ర పోషించగలరని ఆశిస్తున్నట్టు డా.వికాస్‌గౌడ్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ సమావేశాల్లో 'ది డెంటల్ ఇంప్లాంటాలజీ'పై పరిశోధనా పత్రాలు సమర్పించడమే కాక, పలువురు విద్యార్థులకు ఆయన ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తనకు డైరెక్టర్ పదవి లభించడంపట్ల డా. వికాస్ హర్షం వ్యక్తం చేశారు.