Telugu Student Died In US: అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం - వేములవాడలో విషాదఛాయలు
Telugu Student Died In US: అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి చనిపోవడం కలకలం రేపింది. ఫ్లోరిడాలో ఉన్నత చదువులు చదువుతున్న కంటె యశ్వంత్ అనే యువకుడు విహార యాత్రకు వెళ్లి అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయాడు.
Telugu Student Died In US: అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి చనిపోవడం కలకలం రేపింది. ఫ్లోరిడాలో ఉన్నత చదువులు చదువుతున్న కంటె యశ్వంత్ అనే యువకుడు విహార యాత్రకు వెళ్లి అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయాడు. ఈమేరకు యశ్వంత్ పేరెంట్స్‌కు అక్కడినుంచి అతని ఫ్రెండ్స్ సమాచారం అందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్ ఎంఎస్ చదివేందుకు ఎనిమిది నెలల క్రిత ఫ్లోరిడా వెళ్లాడు. వీకెండ్ కావడంతో ఈనెల 29వ తేదీన స్నేహితులతో కలిసి ఐర్లాండ్ దీవులకు వెళ్లాడు. అతనితో పాటు.. శుభోదయ్, చరణ్, శ్రీకర్, మైసూరా, శార్వరి కూడా విహారయాత్రకు వెళ్లారు.
ఐర్లాండ్ దీవులకు వెళ్లిన తర్వాత అక్కడినుంచి అందరూ ప్రైవేట్ బోట్‌లో పిటా దీవులకు వెళ్లారు. తిరిగి వచ్చేందుకు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో బోట్ స్టార్ట్ చేస్తే ఇంజన్ స్టార్ట్ కాలేదు. మరోవైపు.. అలల తాకిడికి బోటు ఒడ్డున 3 మీటర్లలోతు ప్రాంతం నుంచి 25 మీటర్ల లోతుకు చేరుకుంది. ఇది గమనించని యశ్వంత్ సరదాగా సముద్రంలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఈత కొడుతూ బోట్‌ను చేరుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, అలల తాకిడికి బోటు వద్దకు చేరుకోలేకపోయాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సముద్రంలో మునిగిపోయాడు. యశ్వంత్‌ను కాపాడేందుకు మిత్రులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. లైఫ్ జాకెట్స్ ధరించి మూడు గంటల పాటు వెతికినా యశ్వంత్ ఆచూకీ దొరకలేదు.
విషాదంలో మునిగిపోయిన స్నేహితులందరూ వేములవాడలోని యశ్వంత్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అలాగే స్థానిక అధికారులకు విషయం తెలియడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, సోమవారం రాత్రి యశ్వంత్ మృతదేహం దొరికినట్లు అధికారులు తెలిపారు. యశ్వంత్ మృతితో వేములవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్నత చదువులకు వెళ్లి విగతజీవిగా మారతాడని ఊహించలేదని స్థానికులు ఆవేదనలో మునిగిపోయారు.
Also Read: Benefits of Moringa Leaves: మునగ ఆకు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా..?
Also Read: Aluminum Foil Benefits: అల్యూమినియం ఫాయిల్‌తో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook