California Kidnap: కాలిఫోర్నియాలో కలకలం, 8 ఏళ్ల చిన్నారి సహా భారత సంతతి కుటుంబం కిడ్నాప్
California Kidnap: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల చిన్నారి సహా భారతీయ కుటుంబం కిడ్నాప్‌కు గురైంది. మెర్సిడ్ కౌంటీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
California Kidnap: అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం మొత్తాన్ని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో ఈ కిడ్నాప్ చోటుచేసుకుంది. కిడ్నాప్ వివరాలు ఇలా ఉన్నాయి.
భారతీయ సంతతికి చెందిన 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్ దంపతులతో పాటు 8 ఏళ్ల చిన్నారితో కలిసి సెంట్రల్ వ్యాలీలో నివాసముంటున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో వ్యక్తి, ఆ చిన్నారి మామయ్య 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్‌లను అక్టోబర్ 3వ తేదీన గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. సౌత్ హైవే నెంబర్ 59లో బ్లాక్ నెంబర్ 800 వద్ద కిడ్నాప్ జరిగినట్టు మెర్సిడ్ కౌంటీ పోలీసులు తెలిపారు. దుండగుల నుంచి ఏ విధమైన డిమాండ్స్ రాకపోవడంతో కిడ్నాప్ కారణాలు తెలియడం లేదు. దుండగుల వద్ద ప్రమాదకరమైన ఆయుధాలున్నాయని పోలీసులు తెలిపారు.
దుండగుల వద్ద ఆయుధాలుండటంతో..అనుమానితులు లేదా బాధితులు ఎవరికైనా కన్పిస్తే దగ్గరకు వెళ్లవద్దని పోలీసులు సూచించారు. భారత సంతతికి చెందిన వ్యక్తులు కిడ్నాప్‌కు గురి కావడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో అంటే 2019లో ఇదే కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన టెక్కీ తుషార్ అత్రే ఇంటి నుంచి కిడ్నాప్ అయ్యాడు. కాస్సేపటికే గర్ల్‌ఫ్రెండ్ కారులో శవమై కన్పించాడు.
Also read: America Accident: అమెరికాలో రోడ్ టెర్రర్..ముగ్గురు ఎన్నారైల దుర్మరణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook