Best 10 Tourist Spot In Kerala: వేసవిలో కేరళలో తప్పకుండా చూడాల్సిన 10 పర్యాటక ప్రదేశాలు ఇవే..

Sun, 17 Mar 2024-6:31 pm,

మున్నార్ పశ్చిమ కనుమలలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక కొండ స్టేషన్. ఇది పచ్చని టీ తోటలతో అద్భుతమైన దృశ్యాలకు ప్రసిద్ధి. ఇక్కడ వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది.   

అలెప్పీ కేరళలోని బ్యాక్‌వాటర్‌కు ప్రసిద్ధి చెందిన ఒక పట్టణం..హౌస్‌బోట్‌లో బ్యాక్‌వాటర్‌లలో క్రూజ్‌పై వెళ్లడం లేదా గ్రామీణ ప్రాంతాల గుండా కెనాల్‌లో పడవ ప్రయాణం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

కేరళ వెళ్లాలనుకునే వారు తప్పకుండా ఈ బీచ్ ని సందర్శించండి. కోవళం కేరళలోని ప్రసిద్ధ బీచ్. ఇక్కడి బీచ్ లో ఇసుక చాలా తెల్లగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే నీరు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఈ బీచ్ మొత్తం కొబ్బరి తోటలతో ఎంతో అందంగా, అద్భుతమైన లొకేషన్స్ కలిగి ఉంటుంది.  

వయనాడ్ కేరళలోని మరొక అందమైన కొండ స్టేషన్. ఇది దట్టమైన అడవులు, కాఫీ తోటలు, వన్యప్రాణులతో నిండి ఉంటుంది.   

కుమారకోమ్ కేరళలోని బ్యాక్‌వాటర్‌లలో ఒక అందమైన గ్రామం. ఈ గ్రామం కొబ్బరి తోటలతో నిండి ఉండడమే కాకుండా, హౌస్‌బోట్‌లకు ప్రసిద్ధి చెందింది.  

ఇడుక్కి కేరళలోని ఒక కొండ ప్రాంతం. అంతేకాకుండా ఇక్కడ ఆనకట్టలు కూడా ఉంటాయి. దీని చుట్టుపక్కన అందమైన అడవి ప్రదేశాలు కూడా ఉంటాయి.  

త్రిసూర్ కేరళలోని ఒక సాంస్కృతిక నగరం. ఇక్కడ ప్రాచీన దేవాలయాలే కాకుండా, వింత వింత సాంప్రదాయాలు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు ఒక పండగ జరుగుతుంది.  

కొచ్చి కేరళలోని ఒక ప్రధాన నగరం. ఈ నగరానికి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఇక్కడ పెద్ద ఓడరేవు ఉండడమే కాకుండా అందమైన అందమైన బీచ్ కూడా ఉంటుంది.  

పాలక్కాడ్ కేరళలోని ఒక పట్టణం. ఇక్కడ ప్రాచీన కోటలు ఉండడమే కాకుండా చరిత్ర కలిగిన దేవాలయాలు, దట్టమైన అడవులు కూడా ఉంటాయి.  

కాసరగోడ్ కూడా కేరళలోని అందమైన పట్టణం. ఈ పట్టణం చుట్టూ అందమైన బీచ్లు ఉండడమే కాకుండా ప్రసిద్ధ కోటలు కూడా ఉంటాయి. అలాగే కొన్ని ప్రాచీన దేవాలయాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link