Happy New Year 2025 Rangoli: కఠినమైన ముగ్గులు కాదు.. ఈ సింపుల్ ముగ్గులతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేయండి
ఏదన్నా పండగ వచ్చింది అంటే ముగ్గులు తప్పనిసరి. ఇల్లైనా, ఆఫీసైన అలంకరణ మొదలయ్యేది మనం ముందుగా వేసే ముగ్గుల దగ్గర నుంచే.
అంతెందుకు మన ఇంటికి ఎవరన్నా వస్తే.. వాళ్లకి ముందుగా కనిపించేది కూడా మన ఇంటి ముందు ముగ్గులే.
మరి ఇంతగా ప్రాధాన్యత ఉన్న ఈ ముగ్గులను.. మరీ ముఖ్యంగా న్యూ ఇయర్ అప్పుడు రకరకాలుగా వేస్తూ ఉంటారు అందరూ.
అయితే చాలామందికి కష్టమైన ముగ్గులు వేయడం రాదు. అలాంటి వారి కోసమే ఇక్కడ షేర్ చేయబడిన ముగ్గులు అన్నీ కూడా. ఇది మీరు ఎంచక్కా చాలా సింపుల్ గా వేసేయొచ్చు.
ఇక్కడ షేర్ చేయబడిన ముగ్గులు అన్నీ చుక్కలు పెట్టి లేక చుక్కలు పెట్టకుండా కూడా…డ్రాయింగ్ లాగా వేసుకోవచ్చు.
న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి వరకు.. మీ ఇళ్ళని రోజు ఇక్కడ చూపించబడిన ఒక్కొక్క ముగ్గుతో.. అందంగా అలంకరించేయండి.
బియ్యప్పిండి, కలర్స్, పువ్వులు.. ఇలాంటివి వారి ఈ ముగ్గులను మరింత అందంగా కూడా తయారు చేసుకోవచ్చు..
అంతెందుకు ఈ ముగ్గులు వేసి వాటిపైన దీపాలు పెడితే.. ఇక ఆ అందం చెప్పనవసరం లేదు. ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ చెప్పిన ముగ్గులను ట్రై చేసేయండి.