2025 Eclipses: 2025 సంవత్సరంలో సూర్య, చంద్రగహణాల తేదీలు ఇవే!
శాస్త్ర సాంకేతికపరంగా.. కొన్ని వర్గాల విశ్వాసాలపరంగా గ్రహాణాలు అనేవి చాలా ముఖ్యమైనవి. 2025 సంవత్సరంలో ఎన్ని సూర్య, చంద్ర గ్రహణాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఉజ్జయిని జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం ప్రకారం.. కొత్త సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఉండగా.. వాటిలో రెండు చంద్ర గ్రహణాలు.. మరో రెండు సూర్య గ్రహణాలు ఉన్నాయి.
మార్చి 14వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణం ఉండనుంది. ఇది పగటి పూట ఏర్పడనుండడంతో భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించకపోవచ్చు.
మార్చి 29వ తేదీన పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే దీని ప్రభావం భారతదేశంలో ఉండదు.
సెప్టెంబర్ 7-8 తేదీల మధ్యలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది.
సెప్టెంబర్ 21-22 తేదీల మధ్యలో పాక్షిక సూర్య గ్రహణం ఉండనుంది. దీని ప్రభావం భారతదేశంలో ఉండదు.