2025 Holiday List: తెలంగాణాలో వచ్చే ఏడాది లభించే సెలవుల లిస్ట్ ఇదే..!
మరో రెండు, మూడు రోజులలో 2024 ఏడాది ముగియనుంది.. 2025 సంవత్సరానికి వెల్కం చెప్పడానికి ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాదికి గానూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సెలవుల జాబితాని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. అయితే ఇందులో 27 సాధారణ సెలవులతో పాటు 23 ఐచ్చిక సెలవులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.
తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ జాబితా ప్రకారమే సెలవులను పాటించాల్సి ఉంటుందట. అలాగే రెండవ శనివారాలలో ఆదివారాలలో కూడా ప్రభుత్వ కార్యాలయాలను సైతం మూసివేయాలి అంటూ కూడా ఉత్తర్వులను జారీ చేశారు.
న్యూ ఇయర్ రోజున కూడా హాలిడే ని ప్రకటించారు. ఇలా మొత్తం మీద సెలవుల విషయానికి వస్తే.. సంక్రాంతి పండుగకు, ఆ తర్వాత రిపబ్లిక్ డే 26, మహాశివరాత్రి, హోలీ, ఉగాది, ఈద్ ఉల్ ఫిట్ర్, రంజాన్, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, మోహరం, బోనాల్, ఇండిపెండెంట్ డే, గాంధీ జయంతి, దివాలి, కార్తీక పౌర్ణమి, క్రిస్మస్ ఇలా మొత్తం మీద గవర్నమెంట్ హాలిడేస్ 27 రోజులుగా ప్రకటించారు.
ఆప్షనల్ హాలిడేస్ విషయానికి వస్తే.. ఇవి 23 రోజులు ఉన్నవి.. కనుమ, మహావీర జయంతి, శ్రీ పంచమి, బసవ జయంతి, వరలక్ష్మీ వ్రతం, దుర్గాష్టమి, నరక చతుర్దశి ఇలా అఫీషియల్ గా సెలవు దినాలను ప్రకటించారు. మతాలతో సంబంధం లేకుండా ఏదైనా పండుగకు సంబంధించి అఫీషియల్ హాలిడేస్ ను సైతం ఎంప్లాయిస్ ఉపయోగించుకోవచ్చు అంటూ తెలిపారు.
నెలల వారీగా చూసుకున్నట్లయితే న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1వ తేదీన సెలవు ప్రకటించడంతో ఫిబ్రవరి 8 2025 రెండవ శనివారం రోజును పని దినంగా ప్రకటించింది ప్రభుత్వం. ఐదు సాధారణ సెలవులు ఆదివారం రోజున రావడంతో మార్చి నెలలో ఒక్క సాధారణ సెలవు కూడా లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆప్షనల్ సెలవుల్లో గరిష్టంగా ఐదు సెలవులను మాత్రమే వాడుకోవాలని కూడా తెలిపారు.