Top 5 Hydrating Foods: వేసవిలో మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 5 హైడ్రేటింగ్ కూరగాయలు ఇవే..!
కీరదోసకాయలలో 96% నీరు ఉంటుంది. ఇవి వేసవిలో హైడ్రేషన్ కోసం ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి.
టమాటోల్లో 92% నీటిని కలిగి ఉంటాయి. లైకోపిన్, యాంటీఆక్సిడెంట్. విటమిన్ సి, పొటాషియం,విటమిన్ కె వంటి పోషకాలు ఇందులో దొరుకుతాయి. దీని వేసవిలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
సెలెరీ లో 95% నీటిని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫైబర్ అధికంగా లభిస్తుంది. విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె గుణాలు ఉండటం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది.
బీట్‌రూట్ లో 88% నీటిని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్ లభిస్తుంది. వీటితో పాటు విటమిన్ సి, పొటాషియం విటమిన్ ఎ పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి.
పచ్చి కూరగాయలు, పాలకూర, కాలే, బ్రోకలీ వంటివి వాటిలో 90% నీటిని కలిగి ఉంటాయి. విటమిన్లు, మినరల్ప్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. దీని వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.