7 Sacred Ghats Of Kashi: కాశీకి వెళ్లేవాళ్లు ఖచ్చితంగా చూడాల్సిన 7 పవిత్ర ఘాట్‌లు ఇవే..

Fri, 31 May 2024-10:01 am,

దశాశ్వమేధ ఘాట్ - Dashashwamedh Ghat దశాశ్వమేధ ఘాట్ కాశీ (వారణాసి)లోని అత్యంత ప్రముఖమైన పవిత్రమైన ఘాట్.. కాశీకి వెళ్లినవారు.. ఖచ్చితంగా ఈ ఘాట్ సందర్శించాల్సిందే. కాశీలో ఎక్కువగా సందడిగా ఉండే ఘాట్‌లలో ఒకటి.

అస్సీ ఘాట్ - Assi Ghat

అస్సీ ఘాట్ గంగ మరియు అస్సీ నదుల సంగమం వద్ద కొలువై ఉంది.

ఇక్కడ చనిపోయిన పెద్దలకు ఎక్కువగా పిండ ప్రధానాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

 

 

మణికర్ణికా ఘాట్ - Manikarnika Ghat

మణికర్ణికా ఘాట్ పురాతనం మరియు పవిత్రమైన ఘాట్‌లలో ఒకటి. ఇక్కడ హిందువులకు సంబంధించిన దహన సంస్కారాలను నిర్వహిస్తారు. ఇక్కడ శ్మశానంలోని బూడిదతో శివుడికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు.

హరిశ్చంద్ర ఘాట్ - Harishchandra Ghat

హరిశ్చంద్ర ఘాట్ అనేది రాజా హరిశ్చంద్ర రాజు విశ్వామిత్రుడి పరీక్ష సత్యం, దాతృత్యం కోసం ఇక్కడ కాటికాపరిగా పనిచేసిన చోటు.  హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఘాట్‌లలో ఇది ఒకటి.

తులసి ఘాట్ - Tulsi Ghat

తులసి ఘాట్‌కి రామచరితమానస్‌ను రచించిన కవి తులసీదాస్ పేరు మీద ఈ ఘాట్ ఉంది.

 

 

సింధియా ఘాట్  - Scindia Ghat

సింధియా ఘాట్ సింధియా రాజుల పేరు మీదుగా ఇక్కడ ఘాట్ ఉంది. 

కేదార్ ఘాట్ - Kedar Ghat

కేదార్ ఘాట్ శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్ర ఘాట్‌లలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న  కేదారేశ్వర్ ఆలయం పేరు మీదుగా ఈ ఘాట్‌కు  ఆ పేరు వచ్చింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link